Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Kalluru: మానవ సేవే మాధవసేవ

Kalluru: మానవ సేవే మాధవసేవ

తోటి కార్మికులకు దుస్తులు పంపిణీ

మానవ సేవయే మాధవసేవ అని తాను నమ్మిన దృఢ సంకల్పంతో తోటి కార్మికులకు దుస్తులను మైనార్టీ సంఘం అధ్యక్షులు గౌండ హుస్సేన్ పంపిణీ చేశారు. ఈ మేరకు మండల పరిధిలోని చిన్నటేకూరు గ్రామంలో మైనార్టీ సంఘం అధ్యక్షులు గౌండ హుస్సేన్ స్వగృహంలో కార్మికులకు అన్నదాన కార్యక్రమం చేపట్టి, అనంతరం ప్రతి ఒక్కరికి దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది రంజాన్ పండగను పురస్కరించుకొని ముందస్తుగా తనతో పాటు కార్మిక వృత్తిలో జీవనం సాగిస్తున్న తోటి మిత్రులకు తన వంతు సహాయ సహకారాలు అందించాలని ఈ యేడాది రంజాన్ పండగ ప్రారంభం కాకముందే రూ.50 వేల విలువ చేసే వస్తువులను 50 మంది కార్మికులకు ఉచితంగా పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

రంజాన్ పండుగ వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈద్గా, మసీదులు కూడా రంగులు ఉచితంగా పూయించి అన్ని హంగులతో రూపు దిద్దినట్టు వెల్లడించారు. భవన నిర్మాణ రంగంలో వందలాది కుటుంబాలు పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారని తనతో పాటు 40 మంది కార్మికులు నిత్యం పనుల్లో పాల్గొని చాలీచాలని వేతనాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారని వారిని కొంతైనా ఆదుకోవాలనే నెపంతో ప్రతి ఏడాది తనతో పాటు పనిచేసే కార్మికులందరికీ తనకు తోచినంతగా తనకొచ్చిన ఆదాయంలో కూడబెట్టుకొని దుస్తులు అందజేసి వారికీ అండగా నిలుస్తున్నానన్నారు.

ఈ కార్యక్రమంలో కార్మికులు గౌండ రఫీ, సుంకన్న , హనీప్, వెంకటేష్ , గుడిపాడు మధు, మహేష్ , షరీఫ్, ఫాయాజ్ , మౌలి, మధు ,దస్తగిరి, నాగేశం, మద్దిలేటి, ఇదురుష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News