Saturday, November 23, 2024
HomeఆటRam Nagar: పారమితలో కరాటె బెల్టుల ప్రధానం

Ram Nagar: పారమితలో కరాటె బెల్టుల ప్రధానం

కరాటేతో క్రమశిక్షణ, ఆత్మరక్షణ,ఆత్మవిశ్వాసం

స్థానిక పారమిత ఉన్నత పాఠశాల మంకమ్మతోటలో జరిగిన కరాటే పోటీ పరీక్షలలో సుమారు 85 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొని, కరాటేలోని వివిధ స్థాయి బెల్టులను సాధించారు. పారమిత సంస్థలయిన పారమిత ఎక్స్ప్లోరికా, పారమిత రెసిడెన్షియల్ పద్మనగర్ పారమిత ఉన్నత పాఠశాల విద్యార్థులు మాత్రమే ఇందులో పాల్గొన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో అతిథులుగా పారమిత రెసిడెన్షియల్ ప్రిన్సిపల్ రితేష్ మెహతా కో ఆర్డినేటర్ శ్రీనాథ్ ఒకినావ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఎక్జామినర్ & చీఫ్ ఇన్స్ట్రక్టర్ కె. వసంత్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మాయిలు ప్రదర్శించిన ఆత్మరక్షణ విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కరాటెలోని కటాస్, స్వారింగ్, బ్రేకింగ్స్ లాంటి పలు అంశాలను చక్కగా ప్రదర్శించారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపల్ రితేష్ మెహతా మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని శిక్షణ పొందియుండాలని కరాటే తో క్రమశిక్షణ ఆత్మరక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని అన్నారు. విద్యార్థిని విద్యార్థులకు కరాటె బెల్టులను, సర్టిఫికేట్లను ముఖ్య అతిథి చేతులమీదుగా అందజేయడం జరిగింది. కరాటె బెల్టులు మరియు సర్టిఫికేట్లను సాధించిన విద్యార్థిని విద్యార్థులను పారమిత పాఠశాలల చైర్మన్ డా.ఇ. ప్రసాద్ రావు అధ్యాపక బృందం అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News