కరువు నేలను సిరుల సీమగా మార్చడానికి గంగాధర గడ్డపై గోదారమ్మ పరవళ్ళు తొక్కింది. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భగీరథ ప్రయత్నం చేసి గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్ కు నీటి విడుదల చేయించడంతో నెల రోజుల వ్యవధిలో గంగమ్మ తల్లి రెండవసారి సవ్వడి చేసింది. చొప్పదండి నియోజకవర్గం లోని రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోకుండా చివరి మడి వరకు సాగునీరు అందజేస్తామన్న మాటను నిలబెట్టుకుంటూ సకాలంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నారాయణపూర్ రిజర్వాయర్ కు నీటిని విడుదల చేయించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. పొట్ట దశలో ఉన్న పరి పొలాలకు జీవం పోస్తూ గంగాధర గడ్డపై గోదారమ్మ పరవళ్ళు తొక్కడంతో సంతోషం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు. చొప్పదండి నియోజకవర్గ ప్రజల సంక్షేమమే తన లక్ష్యమని, అన్నదాతలు ఇబ్బంది పడకుండా అధికారులతో మాట్లాడి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నారాయణపూర్ రిజర్వాయర్కు నీటిని విడుదల చేయించామన్నారు. ప్రతిపక్షాల అబద్ధపు ప్రచారాన్ని నమ్మి అన్నదాతలు ఆందోళన చెందవద్దని, రైతులను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సాగు చేసిన పంటలు ఎండిపోకుండా సకాలంలో నారాయణపూర్ రిజర్వాయర్ కు నీటిని విడుదల చేయించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు చొప్పదండి నియోజకవర్గ రైతాంగం కృతజ్ఞతలు తెలిపారు.