Saturday, April 19, 2025
HomeతెలంగాణThangallapalli: కదనభేరి బహిరంగ సభకు భారీగా తరలిరావాలి

Thangallapalli: కదనభేరి బహిరంగ సభకు భారీగా తరలిరావాలి

కరీంనగర్ లో కదనభేరి

ఈనెల 12 వ తేదీన కరీంనగర్ లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే కదనభేరి బహిరంగ సభకు పార్టీ నాయకులు, మహిళా నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఎంపీపీ పడగల మానస రాజు పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మహిళా నాయకురాళ్ల తో కలిసి కదనభేరి బహిరంగ సభకు సంబంధించిన గోడ పోస్టర్ ను ఎంపీపీ ఆవిష్కరించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలంలోని మహిళలందరూ, బిఆర్ఎస్ కార్యకర్తలు, సీనియర్ నాయకులు, తదితరులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆమె అన్నారు. ఉద్యమాల గడ్డ కరీంనగర్లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా కదనభేరి సభలో ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించడం జరుగుతుందని వెల్లడించారు. ఎలాగైతే అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ గెలుపు కోసం కష్టపడ్డామో.. అలాగే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ గెలుపు కోసం నిర్విరామంగా కష్టపడి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని వెల్లడించాడు. ఇప్పుడున్న ఎంపి మన కరీంనగర్ కు గానీ, మన జిల్లాకు గానీ, మండలానికి గానీ ఎన్ని నిధులు తెచ్చారో ప్రజలు గమనించాలని అన్నారు. పార్లమెంటులో తెలంగాణకు నిధులు తేవాలంటే బోయిన్పల్లి వినోద్ కుమార్ నీ కరీంనగర్ ఎంపీ గా గెలిపించుకోవాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పూసపల్లి సరస్వతి, మండల పార్టీ మహిళా విభాగం బీసీ సెల్ అధ్యక్షురాలు కోడం సంధ్యారాణి, ఎస్సీ సెల్ అధ్యక్షురాలు సద్దరోజా, మండల మైనారిటీ మహిళా అధ్యక్షురాలు ఎండి షాహేద బేగం, కందుకూరి రజిత, రంగు తార, పర్కపల్లి స్వప్న పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News