Sunday, October 6, 2024
HomeదైవంBandiathmakuru: ఘనంగా ఓంకారేశ్వర రథోత్సవం

Bandiathmakuru: ఘనంగా ఓంకారేశ్వర రథోత్సవం

గంగా ఉమాసమేత ఓంకారసిద్ధేశ్వర స్వామి ఉత్సవం

మండలంలోని ఓంకారేశ్వర క్షేత్రంలో శ్రీ గంగా ఉమాసమేత ఓంకారసిద్ధేశ్వర స్వామి ఉత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మూలవిరాట్ లైన గంగా ఉమాసమేత ఓంకారసిద్ధేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను రథంపై ఊరేగించారు. భక్తులు స్వామి వారికి హారతులు, నైవేద్యం సమర్పించి మ్రొక్కులు తీర్చుకున్నారు. మంగళ వాయిద్యాల నడుమ వైభవంగా రథోత్సం నిర్వహించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బారెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీపీ దేసు వెంకట రామిరెడ్డి , మాజీ జడ్పీటిసీ సుబ్బారెడ్డి ఆలయ చైర్మన్ విశ్వనాథరెడ్డి, ఆలయ కార్యనిర్వాహణ అధికారి నాగప్రసాద్, ఆలయ పూజారులు చక్రపాణి, మృగపాణి శర్మలు, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News