Friday, April 18, 2025
HomeదైవంMuchchatla: శ్రీ ముచ్చట్ల క్షేత్రంలో రథోత్సవం

Muchchatla: శ్రీ ముచ్చట్ల క్షేత్రంలో రథోత్సవం

నంది కోలాటం..

ముచ్చట్లలో వెలసిన శ్రీ భ్రమరాంభిక సమేత శ్రీ మల్లిఖార్జునస్వామి వార్ల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని అశేష జనవాహినీ మధ్యన శ్రీ భ్రమరాంభిక సమేత మల్లికార్జున స్వామి వారి రథోత్సవం కన్నుల పండుగగా నిర్వహించడం జరిగింది. శ్రీ స్వామి అమ్మవార్లు రథోత్సవం కన్నులారా చూసేందుకు వేలాది మంది భక్తులు ముచ్చట్లకు తరలివచ్చారు. భక్తులు హరహర మహాదేవ శంభో- శంభో శంకర అంటూ శివనామ స్మరణతో ముచ్చట్లలో మారు మ్రోగిపోయింది.

- Advertisement -

ఓంకార నాదంతో రథోత్సవం ఆలయం చుట్టూ ఊరేగింపు నిర్వహించారు. శ్రీ స్వామి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నంది కోలాటం నిర్వహించారు. ఈ రథోత్సవ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మాజీ చైర్మన్ యామసాని జగన్మోహన్ రెడ్డి , ముచ్చట్ల ఆలయ కార్యనిర్వహణ అధికారి మద్దిలేటి , యమసాని భాస్కర్ రెడ్డి, పాండురంగారెడ్డి కుమారుడు డాక్టర్ ఉపేందర్ రెడ్డి , ఆలయ సిబ్బంది.,, బేతంచెర్ల పట్టణమునుండి మరియు చుట్టు ప్రక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు, ప్రజలు రథోత్సవంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News