Saturday, November 23, 2024
HomeతెలంగాణGodavarikhani: మాజీ ఎమ్మెల్యేతో సహా బి.ఆర్.ఎస్ నాయకులపై కేసు

Godavarikhani: మాజీ ఎమ్మెల్యేతో సహా బి.ఆర్.ఎస్ నాయకులపై కేసు

సూఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసు

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎన్.టి.పి.సి. పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ మెరుగు లింగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు బి.ఆర్.ఎస్. మాజీ ఎమ్మెల్యేతో సహా 14 మంది బిఆర్ఎస్ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ… తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి తెలంగాణ తీసుకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ 10 యేళ్ల పాటు అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్లిన అభివృద్ధి ప్రదాత కె.సి.ఆర్ అని కొనియాడారు. బి.ఆర్.ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ పై కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ గత నెల 6వ తేదీన ఎన్.టి.పి.సి. పోలీస్ స్టేషన్ పరిధిలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తో మరికొంత మంది బీఆర్ఎస్ నాయకులు కలసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.

- Advertisement -

అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయడంతో పాటు, ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎన్నో లాఠీ దెబ్బలు తిని 45 రోజులు జైల్లో పెట్టినా బయపడలేదని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రశ్నిస్తూనే ఉంటామని మాజీ ఎమ్మెల్యే తెలిపారు. ఈ ప్రభుత్వంలో ప్రజా పాలన కాదు పోలీస్ పాలన నడుస్తుందని విమర్శించారు. ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు రానున్న రోజుల్లో పోరాటాలను చేస్తూనే ఉంటామని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News