సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలన దేశానికే ఆదర్శమని వైఎస్సార్ సీపీ సమన్వయకర్త విరుపాక్షి, కర్నూలు మేయర్ బీవై రామయ్య అన్నారు. ఆలూరులో వాలంటీర్ల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందించాలని లక్ష్యంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేశారన్నారు. వాలంటీర్ల వ్యవస్థ ఉండడం వల్ల ప్రభుత్వం సంక్షేమ పథకాలు సకాలంలో లబ్ధిదారులకు అందించడం జరిగిందని వారు తెలిపారు.
వాలంటీర్ల సేవలు మరువలేనివి వారు కొనియాడారు. వాలంటీర్లు ప్రభుత్వానికి ప్రజలకు మద్య వారదులుగా పని చేయాలని వారు తెలిపారు. వాలంటీర్లు ప్రభుత్వం నుంచి జరిగిన మేలును ప్రజలకు వివరించాలని వారు కోరారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్ని ఉచిత హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని వారు తెలిపారు. చంద్రబాబు నాయుడు పని అయిపోయిందని వారు విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ నాయకులు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కోనంకి జనార్దన్ నాయుడు, ఆలూరు జెడ్పీటీసీ సభ్యుడు ఏరురూ శేఖర్, మండల కన్వీనర్ చిన్న ఈరన్న, కో కన్వీనర్లు మల్లికార్జున, వీరేష్, తెర్నెకల్ సురేందర్ రెడ్డి, చిప్పగిరి ఎంపీపీ మారయ్య, తదితరులు పాల్గొన్నారు.