Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandikotkuru: ఎన్నికల్లో వైసిపి జెండా ఎగరడం ఖాయం

Nandikotkuru: ఎన్నికల్లో వైసిపి జెండా ఎగరడం ఖాయం

వైసీపీ పార్టీ ఆఫీస్ ప్రారంభం

వైసిపి పాలనలో ప్రజలకు అందిన సంక్షేమ పథకాలు, సీఎం జగన్మోహన్ రెడ్డి సహకారంతో నియోజవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలను గౌరవించే బాధ్యత కలిగిన ప్రజల నాయకులుగా ప్రజల మెప్పు పొందిన వైఎస్ఆర్సిపి పార్టీ వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ప్రజల ఆశీర్వాదంతో ముచ్చట మూడోసారి వైసీపీ జండా ఎగరవేయడం ఖాయమని ఏపీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

పట్టణంలోని వైయస్ఆర్సీపీ పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, వైసీపీ నియోజవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధీర్ ధార, మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి హాజరయ్యారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేస్తున్న ఏపీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి చౌడేశ్వరి గుడి నుంచి మొదలుకొని వైసిపి పార్టీ కార్యకర్తలు సిద్ధార్థ్ రెడ్డి అభిమానులు బాణాసంచా పేలుస్తూ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఏపీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రిబ్బన్ కట్ చేసి నూతన వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, డాక్టర్ సుదీర్ దార రాష్ట్ర రాజకీయాలపై వైసీపీ పాలనలో ప్రజల అందించిన సంక్షేమ పథకాలు అభివృద్ధిపై మాట్లాడారు. బిజెపి టిడిపి, జనసేన పొత్తులపై బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ప్రజల మనసు గెలవడం గొప్పకాని,పొత్తులతో కేసులకు భయపడి టిడిపి పార్టీ రాష్ట్రంలో ప్రజల ఆదరణ లేని పార్టీలకు సీట్లు కేటాయించడం చూస్తుంటే టిడిపి పార్టీ కేవలం స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం, పలు కేసులు నుంచి తప్పించుకోవడానికి మాత్రమే ఉంది అంటూ ఆరోపించారు.

నియోజవర్గంలో టిడిపి నాయకులలో వారికి వారే నాయకత్వం కోసం కొట్లాడుతున్నారని, ప్రజల కోసం పాటుపడింది ఏమీ లేదని విమర్శించారు. ప్రజల మద్దతుతో, ప్రజల ఆదరణ కలిగిన సీఎం జగనన్న నాయకత్వంలో ముచ్చటగా మూడోసారి నందికొట్కూరు నియోజకవర్గం లో వైసీపీ పార్టీ ఆరి మెజార్టీతో గెలుపునుతుందని, గెలుపు ఖాయమని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ రహత్ అబ్దుల్ జబ్బార్, అబ్దుల్ జబ్బార్, వైసీపీ సీనియర్ నాయకులు శివరామకృష్ణారెడ్డి, పుల్యాల నాగిరెడ్డి, బద్దుల శ్రీకాంత్, వైసిపి ఉమ్మడి జిల్లాల మైనారిటీ జోనల్ ఇంచార్జ్ అబూబుకర్, వైసీపీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఉస్మాన్ బేగ్, వైసిపి పట్టణ అధ్యక్షులు మన్సూర్, కౌన్సిలర్ చిన్న రాజు, షేక్ నాయబ్, రాహుఫ్, చాంద్బాషా, అల్లూరి క్రిష్ణ, మనుపాడు అశోక్, వైసిపి పట్టణ ప్రధాన కార్యదర్శి మార్కెట్ రాజు, ఉపేంద్ర రెడ్డి, చింత విజ్జి, మరియు వివిధ మండలాల పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News