పత్తికొండ మండల పరిదిలోనే ఆయా గ్రామాలలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ చందోలి గ్రామంలో ఒక్క కోటి ముప్పై రెండు లక్షల యాబై నాలుగు వేల రూపాయలతో పూర్తి చేసిన అభివృద్ధి పనులు ప్రారంభించారు. చక్రాళ్ళ గ్రామంలో నలబై మూడు లక్షల అరవై వేల రూపాయల నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని రూ ఇరవై మూడు లక్షల తొంబ్బై నాలుగు వేల రూపాయలతో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ రైతు భరోసా సెంటర్ ను, గడప-గడపకు మన ప్రభుత్వం నిధులు మరియు ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో 65 లక్షలతో పూర్తి అయిన సీసీ రోడ్లు మరియు డ్రైనేజీలను ప్రారంభించారు.
అలాగే పందికోన గ్రామంలో 43.60 లక్షల సచివాలయం సిసి రోడ్లు 23 లక్షల రూపాయలతో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీరాములు, జెడ్పీటీసీ ఉరుకుందమ్మ, ఎంపిపి నారాయణ దాస్, మండల కన్వీనర్ కారం నాగరాజు. వైస్ ఎంపీపీ బలరాముడు.వైస్ సర్పంచ్ రంగా నాయక్.ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్ నాయక్, ఎస్ టి సెల్ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ నాయక్, బిసి సెల్ జిల్లా అధ్యక్షుడు సోమ శేఖర్, పత్తికొండ మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు చక్రాల గ్రామం వైఎస్ఆర్ పార్టీ నాయకులు, మండల పంచాయతీరాజ్ అధికారులు, వ్యవసాయ అధికారులు, సచివాలయం సిబ్బంది, మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.