Saturday, October 5, 2024
Homeఓపన్ పేజ్Wise voters: ఓటరు చైతన్యమైతేనే పార్టీ ఫిరాయింపులకు అడ్డుకట్ట

Wise voters: ఓటరు చైతన్యమైతేనే పార్టీ ఫిరాయింపులకు అడ్డుకట్ట

చట్టం చేయని పని ఓటర్లు చెయ్యాలి

దేశంలో త్వరలో లోకసభకు సార్వత్రిక ఎన్నికలు సమీపి స్తున్న కొద్ది దేశ రాజకీయాలలో సమీకరణాలు వేగంగా మారుతు న్నాయి. గాలి ఎటు వీస్తే అటు మారే నాయకుల సంఖ్య పెరిగింది. గెలుపు గుర్రాలను ఎన్నికల్లో నిలిపే రాజకీయ సంస్కృతి రాజ్య మేలుతుంది. గెలుపే లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీలు, అభ్యర్థులు గెలుపు అవకాశాలు వున్న పార్టీకి మారిపో వడం. పార్టీ సిద్ధాంతాలతో పని లేకుండా అనైతి కంగా అవకాశ వాదంతో అధికారం కోసం పార్టీ మారుతు న్నారు. ప్రభుత్వంలో పలుకుబడి తమకు అనుకూలంగా ప్రభుత్వ నిర్ణ యాలు ధన సంపాదన లాంటివి ఫిరాయింపులకు దారితీస్తు న్నాయి. సంఖ్యా పరంగా శాసనసభలో సాధారణ మెజార్టీ దగ్గర స్థానాలు పొందిన ట్లయితే పార్టీ పిరాయింపులు ఎక్కువ జరుగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ అధికా రంలోకి రాదని భావిస్తే ఇతర పార్టీల్లోకి పిరాయింపులు జరుగు తాయి.

- Advertisement -

ఉదాహరణకు రెండు తెలుగు రాష్ట్రాలలో బిఆర్‌ఎస్‌ వైఎస్‌ఆర్‌సి పి పార్టీలకు చెందిన ఎంపిలు, బిజెపి, కాంగ్రెస్స్‌ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. పార్టీ లకు సమర్థవంతమైన నాయ కత్వం లేక పోవడం. అంతర్గత ప్రజా స్వామ్యం లోపించడం. ముఠా రాజకీయాలు. వారసత్వ రాజకీయాలు పార్టీ పిరాయిం పుల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అవకాశ వాదమే అర్హతైంది అవకాశవాదమే ఎన్నికల్లో పోటీ చేయడానికి అదనపు అర్హతైంది. ఎన్నికల్లో పోటీ చేసి గెలిచేందుకు ఏదో ఒక పార్టీ టిక్కెట్‌ దక్కించుకొని అధికారం లోకి రావడమే ధ్యేయంగా నిస్సిగ్గుగా పార్టీలు పిరాయించే జంప్‌ జిలానీల వికృత సంస్కృతి పెట్రేగి పోతుంది. అంతకు ముందు తాము చేసిన వాగ్దానాలు ప్రజలకు చెప్పిన మాటలు వదిలి రాత్రికి రాత్రే పార్టీలు మారుతున్నారు. తమ నాయకత్వం మీధ విశ్వాస ముంచి గెలిపించిన కార్యకర్తలను విడిచి యదేచ్చగా పార్టీలు మారి కండువాలు మార్చే రాజీ రాజ కీయాలు చోటు చేసుకోవడం ప్రజాస్వామ్యానికి తనను నమ్ము కున్న కార్యకర్తలకు సవాల్‌గా పరిణమించింది.

ఎన్నికల్లో కష్టపడి ఎన్నో ఆశలతో గెలిపించుకున్న ప్రజా ప్రతి నిధులు పార్టీ మారితే కార్యకర్తలు కల్లప్పగించి చూస్తూనే ఉన్నారు తప్ప తమ నాయకుడు పార్టీ మారడాన్ని అడ్డుకోలేని స్థితిలో ఉన్నారు. నాడు సిద్ధాంత నిబద్ధత అంకిత భావమే ఎంపికకు గీటురాయి స్వాతంత్రం వచ్చిన రోజుల్లో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కార్యకర్తల అభిప్రాయం ప్రకారం జరిగేది. రాజకీయ పార్టీలు వాటి నాయ కత్వం పార్టీ సిద్ధాంతాలకు క్రమశిక్షణకు కట్టుబడి పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకవెళ్ళే అంకితభావం సేవా భావం ప్రజలతో మెరుగైన సంబంధాలు ఉన్న అభ్యర్థులకు పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్లు ఇచ్చే వారు. ఓడిన గెలిచిన జీవితాంతం పార్టీకి సేవలు అందించే వారు.రాజకీయాల్లో కొనసాగే వారు నాడు రాజకీయాల్లో సమాజ సేవకులు త్యాగధనులు, స్వతంత్ర పోరాట యోధులు, నిస్వార్థ సేవకులు, క్రియాశీలక పాత్ర పోషించేవారు.పార్టీ ఫిరాయించే వారిని చులకనగా చూసే సామాజిక వాతావరణం వుండేది. నాడు వెనుక ముందు ఆలోచించి పార్టీ మారే వారు. నాడు సిద్ధాంతాల పరంగా విభేదించి పార్టీలు మారే వారు. గతంలో ఉన్న పార్టీ ద్వా రా వచ్చిన పదవులకు రాజీనామా చేసే వారు. ఇందిరా కాంగ్రెస్స్‌ పార్టీ అవతరణ తర్వాత పార్టీ ఫిరాయింపుల సాంప్రదాయం జోరందుకుంది.

కానీ నేడు పూటకో పార్టీ మారే ఫిరాయింపు వీరులు పెరిగి పోయారు. పార్టీలు చీలడం ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం. ఆదునిక ప్రజాస్వామ్య లక్షణమైంది. కండువాలు మార్చుకునే సంస్కృతి పెరిగింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఒక పార్టీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసి పార్టీ బి ఫార్మ్‌ ఇవ్వక పోతే మరో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే నాయకులు పార్టీలు మారి కండువాలు మార్చుకున్న సంఘట నలు చోటు చేసుకోవడం సర్వ సాధారణమైంది. పార్టీ పీరాయింపులు- మారుతున్న రాజకీయాల స్వభావం గతంలో ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసు కున్న వారు ప్రజా సేవా పేరు మీద పాత తిట్లను ఆరోపణలను మరిచిపోయి వారు పవిత్రులుగా మారిపోయే నవ రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీల ఫిరాయింపు వల్ల రాజకీయాల స్వరూపం స్వభావాలు మారిపోతున్నాయి. స్వాతంత్రం తొలి రోజుల్లో ప్రతి రాజకీయ పార్టీ నియోజక వర్గంలో పోటీ చేసే అభ్యర్థులను 5 సంవత్సరాల ముందే ప్రకటిం చి ప్రజా సమస్యల పరిష్కారం కోసం సమర్థత, దక్షత వున్న వ్యక్తు లను అభ్యర్థిగా ప్రకటించేవారు.

కానీ నేడు జాతీయ పార్టీలు, ప్రాం తీయ పార్టీలు, ఉప ప్రాంతీయ పార్టీలు నామినేషన్‌ కంటే ఒక రోజు ముందు అభ్యర్థులను ప్రకటించడం వల్ల పార్టీ పిరాయిం పులు ఎక్కువగా జరుగుతున్నాయి. ధన స్వామ్యమైన ప్రజాస్వామ్యం చట్ట సభలకు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రతిభ సామర్థ్యం కలిగిన ఉత్తమ అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చే స్థితిలో రాజకీయ పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. పార్టీలు ధనికులు కార్పొరేట్‌ కంపెనీల ప్రతినిధులకు టిక్కెట్లు ఇవ్వడంలో పోటీ పడుతున్నాయి. వాణిజ్య, వ్యాపార రంగ నిపుణులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం రాజకీయ పార్టీలు వారికే టిక్కెట్లు ఇవ్వడం వల్ల దేశ ప్రజల అభివృధ్ది సంక్షేమం ఆశించిన మేరకు జరుగలేదు. ఎన్నికల్లో పోటీ చేసి గెలువాలంటే కోట్లాది రూపాయలు కర్చు చెయ్యాలి. సాధారణ పౌరుడు ఎన్ని కల్లో పోటీ చేసే అవకాశం లేదు. కులం, మతం, ప్రాంతం బాషా, ప్రాతిపదిక మీద ఓట్లు అడిగే సంస్కృతి సాంప్రదాయం కొనసా గడం వల్ల నియోజ వర్గంలో అధికసంఖ్యలో ఉన్న కులానికి చెందిన అభ్యర్థికి టికెట్‌ ఇవ్వడం జరుగుతుంది. ఎన్నికల వ్యయం పెరిగింది రాజ్యాంగం అందరికి సమాన రాజకీయ అవకాశాలు కల్పిం చింది. కానీ రాజకీయాలు కులం, మతం, ప్రాంతం, మైనార్టీ పేరు మీద చెలామణి అవుతున్నాయి. కులం, డబ్బు ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎన్నికలు ఖరీదైనవిగా మారినాయి. ఒక నియో జ వర్గంలో గెలువాలంటే 100 కోట్ల నుండి 500 కోట్ల రూపాయల వరకు వ్యయం చెయ్యాల్సి వస్తుంది. పార్టీకి డబ్బులు ఇచ్చి టిక్కెట్‌ దక్కిచుకుంటున్నారు. పార్టీలు టిక్కెట్లు ఆశించే వారి నుండి పార్టీకి చందాలు వసూలు చేస్తున్నారు. రాజకీయాల్లోకి ధనంతో ప్రవేశించి ధన సంపాదనలో పోటీ పడి రాజకీయాలను వాణిజ్య వ్యాపార పరం చేశారు. ఓటర్లు జనకర్ష పథకాలు ఓటర్లు ఎవరిని గెలిచినప్పటికీ సంక్షేమ పథకాలు పొందడం తమ హక్కుగా భావిస్తున్నారు.

ఎవరు గెలిచినా సంక్షేమ పథకాలు చెలామణి అవుతాయి. అవి ఆగిపోవని ఉచితాలు, జనాకర్షణ పథకాలు ప్రభుత్వాలకు ఊపిరిగా మారాయి. ఏ పార్టీ అధికారం లోకి వచ్చిన పథకాల పేర్లు తప్ప వాటిని కొనసాగిస్తారనే భావన ఓటర్లలో ఉంది. అన్ని రాజకీయ పార్టీలు అభివృద్ధిని గాలికి వది లేసి, పథకాలతో ఉచితాలను ఎరగాచూపి ఓట్లను రాబట్టు కునే ఓటుబ్యాంకు దృక్పథం పెచ్చరిల్లింది. పార్టీలు ఓటరును ఓటింగ్‌ యంత్రం స్థాయికి దిగజార్చాయి. ఓటుకు నోటు ప్రజాస్వామ్యానికి చేటు రాజకీయ పార్టీలు అభ్యర్థులు ఎన్నికల్లో గెలవడానికి ఓటుకు నోటు ఇచ్చే సంస్కృతిని పెంచి మార్కెట్లో ఓటర్లు వస్తువు స్థాయికి దిగజార్చినారు. ఉచితలకు, తాయిలాలకు ఓటరు ఆకర్షితుడై ఓటు వేస్తున్నారు. అభివృద్ధిని సంక్షేమాన్ని సమదృష్టితో చూసే ముఖ్యమంత్రి ఎన్నికైనప్పుడు మాత్రమే దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చైతన్య వంతమైన ఓటర్లు ఆలోచిస్తున్నారు. పార్టీలు ఓటర్ల యొక్క బలహీనతలపై రాజకీయాలు చేస్తూ దేశ ప్రయోజనా లను పార్టీ ప్రయోజనాల కొరకు బలి పెట్టి ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేస్తున్నారు. రాజకీయ పార్టీలు సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం నుండి ఓటర్‌ స్లిప్పుల, పంపిణీ పోలింగ్‌, కౌంటింగ్‌, ఏజెంట్ల వరకు జరిగే కార్యక్రమాలను పార్టీ కార్యకర్తలతో కాకుం డా రోజువారి కూలీలతో నిర్వహించడం వల్ల కార్యకర్తలు లేకపో యినా నాయకులు తయారయ్యే విచిత్ర సంస్కృతి నెలకొన్నది. కార్పోరేట్‌ ఎన్నికల సంస్కృతికి ఓటర్లు అలవాటు పడ్డారు. ఆయా పార్టీల కార్యకర్తల్లో డబ్బులు తీసుకొని పనిచేసే అలవాటు పెరి గింది. ఒకప్పుడు పార్టీ కార్యకర్తలే ఎన్నికల ప్రచారం ఓటర్ల స్లిప్పులు, పంపిణీ స్వయంగా చూసుకునేవారు. పార్టీ అభ్యర్థుల విజయానికి చిత్తశుద్ధితో పనిచేసేవారు.

రాను రాను క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తలు తగ్గిపోయి పార్టీ నాయకత్వానికి కార్య కర్తలకు మధ్య దూరం పెరిగింది. ప్రతి పనికి డబ్బులు తీసుకొని పనిచేసే సంస్కృతి పెరిగింది. దీనివల్ల నాయకులు కార్యకర్తలు అభద్రతాభావానికి లోనవుతున్నారు. డబ్బు – కులం – టిక్కెట్లు ప్రజల ఇష్టా ఇష్టాలతో సంబంధం లేకుండా డబ్బు, కులమే ప్రామాణికంగా అభ్యర్థులను ఎంపిక చేసి వారి నెత్తిన రుద్దుతు న్నారు. కార్యకర్తల అభిప్రాయాన్ని సేకరించకుండా స్థానిక అభ్యర్థులను కాకుండ దిగుమతి చేయబడిన నాయకులను వారు భరించవలసిన వస్తుంది. చట్ట సభలు – క్రిమినల్స్‌ ప్రవేశం చట్టసభల్లోకి క్రిమినల్స్‌ ధనస్వాములు, రియలిస్టులు, డ్రగ్‌ మాఫియా ప్రవేశించి కోట్లాది రూపాయలు పెట్టుబడును పెట్టి అధికారాన్ని హస్తగతం చేసుకొని తమ వ్యాపార లాభాలను పెంచు కోవడానికి రాజకీయాలను సాధనంగా వాడుకుంటున్నారు. రాజ కీయాలు వాణిజ్య పరమైపోయి ధనికులు మాత్రమే చట్టసభల్లో ప్రవేశించే పరిస్థితి నెలకొంది. గతంలో ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాల గురించి ఆలోచించేవారు. కానీ ఇప్పుడు ఓడిన గెలిచిన పార్టీలు రెండు ప్రతి విషయాన్ని ఎన్నికల కోణం లోని ఆలోచిస్తు పని చేస్తున్నాయి. ఓటర్లను ఎలా ప్రభావితం చెయ్యాలి? ఓటర్ల బలహీనతలు ఏమిటి ?ఓటర్లు ఏ విధంగా తమ వైపు మొగ్గుతారు? అనేటువంటి సర్వేలపై ఆధారపడి అభ్యర్థులను ఎంపిక చేయడం కార్యకర్తల అభిప్రాయాలు తీసుకోకపోవడం ఎన్నికల వ్యూహకర్తల సర్వేలు, సలహాల సంప్రదింపుల పైన పార్టీ లు అభ్యర్థులను ఎంపిక చేయడం ఎన్నికల వ్యూహాలను రూపొం దించు కోవడం వల్ల క్షేత్రస్థాయిలో పార్టీకి ప్రజల పట్ల ఉన్న విశ్వ సనీయత తెలియని గందరగోల పరిస్థితి దాపురించింది.

దొంగ ఓట్లను అరికట్టాలి దొంగ ఓట్ల బెడద ఎక్కువైంది. ప్రతి సారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్‌ లిస్టులో బోగస్‌ ఓటర్ల పేర్లు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల కమిషన్‌ నియమాలను ఉల్లంఘిస్తూ ఒకే ఇంటిలో వందలాది ఓటర్లు నమోదైన ఆధారాలు ఉన్నప్పటికీ వారిని బోగస్‌ ఓటర్లుగా గుర్తించినప్పటికీ వారిపై ఎలాంటి చర్య తీసుకోక పోవడం ఎన్నికల సంఘం నిర్లక్ష్యం ఉదాసీనత ఎన్నికల వ్యవస్థ పవిత్రత మీద విశ్వసనీయత తగ్గింది. ఓటరు లిస్టులో లోపాలు ఓటరు లిస్టుల రిగ్గింగు ప్రజాస్వామ్యానికి సవాల్‌గా పరిణమిం చింది. ఓటు హక్కు ను స్వేచ్ఛగా వినియోగించుకునే పరిస్థితులు లేవు. అధికార బలం, ధన బలం, ఉన్న వారే ఎన్నికలను శాసిస్తు న్నారు. స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం రాజ్యాంగం మనకు అందించి కాని పనిచేయడంలో దాని స్వయం ప్రతిపత్తిని కూల్పోయింది .గత ఎన్నికల సమయంలో బూతుల్లో ఏకంగా ఓటర్‌ లిస్టులనే రిగ్గింగ్‌ చేసే సంస్కృతి పెరిగింది. కులం, మతం, ప్రాంతం, డబ్బు వీటన్నింటినీ ఓటర్ల మీధ ప్రయోగించడంతో ఎన్ని కల వాతావరణం పూర్తిగా కలుషితమైంది. ప్రజా సేవ లక్ష్యంగా రాజకీయాలలో ప్రవేశించే వారి సంఖ్య తగ్గిపోయింది. స్వచ్ఛం దంగా పనిచేసే నాయకులు కార్యకర్తలు దాదాపు అన్ని పార్టీల్లో కనుమరుగైపోయారు. ఉన్నత భావాలు పారదర్శకత, జవాబుదారీ తనం ఉత్తమ నాయకత్వ లక్షణాలుకలిగిన వారు రాజకీయాల్లోకి రావాలి. కార్పొరేట్‌ రంగం కబంధ హస్తలల్లో చిక్కుకున్న రాజ కీయాలను నిలువరించేందుకు రాజకీయ పార్టీలు కృషి చేయాలి. నేరమయ రాజకీయాల నుండి ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షిం చుకోవాలి. ప్రతి ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలవాలి. ప్రజలు గెల వాలి. అందుకు విజ్ఞులైన ఓటర్లు చైతన్యవంతమై పార్టీ పిరాయిం చిన అభ్యర్థులను బూతులోనే ఓటుతో గుణపాఠం చెప్పాలి.

చట్టం చేయని పని ఓటర్లు చెయ్యాలి. ప్రజాస్వామ్యంలో నిజమైన ప్రభు వులు ప్రజలే తమ చేతిలో వున్న సార్వభౌమాధికారాన్ని ఓటు ద్వా రా ప్రజా ప్రతినిధులను ఎన్నుకునే ముందు ఉత్త ములను ఎన్ను కోవాలి. అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలకు అతీతంగా పార్టీ ఫిరాయింపులను అరికట్టాలి. రాజకీయాల్లో నైతిక విలువలు పాటించాలి. రాజకీయ, అస్థిరత, రాజకీయ అవినీతిని అనైతిక పాలను అడ్డుకోవాలి. ప్రజాస్వామ్యం అంటే అంకెల గారడి కాదు. నిజమైన ప్రజాభి ప్రాయానికి ప్రతిబింభం కావాలంటే పార్టీ పిరాయింపులను సంపూర్ణంగా నిరోధించాలి. విజ్ఞత గల ఓటర్ల చైతన్యంతో కలుషిత రాజకీయాలను అడ్డుకోవాలి. ప్రజల నిరంతర అప్రమత్తతే ప్రజాస్వామ్యానికి రక్ష.

– నేదునూరి కనకయ్య 9440245771

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News