తెలంగాణ కొత్త సెక్రటేరియట్ భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తులో అగ్నిప్రమాదం జరగగా గుమ్మటంపై భారీగా దట్టమైన పొగలు అలముకున్నాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగినట్టు అగ్నిమాపక దళం చెబుతోంది. 11 ఫైర్ ఇంజిన్లతో మంటలు తక్షణం ఆర్పేశారు. కాగా ఈనెల 17వ తేదీన సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కొత్త సచివాలయ భవనాన్ని ప్రారంభోత్సవం చేసేందుకు అన్ని ఏర్పాట్లు శరవేగంగా చేస్తుండగా అగ్ని ప్రమాదం జరిగింది.