Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Bethamcharla: సోషల్ మీడియా సభ్యులతో సిఐ సమావేశం

Bethamcharla: సోషల్ మీడియా సభ్యులతో సిఐ సమావేశం

వ్యక్తిగత దూషణ, అసభ్య పదాలకు నో ప్లేస్

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వివిధ పార్టీలకు చెందిన సోషల్ మీడియా సభ్యులతో బేతంచెర్ల సీఐ ప్రియతమ్ రెడ్డి, ఎస్ఐ శివ శంకర్ నాయక్ లు బేతంచెర్ల పోలీస్ స్టేషన్ లో సమావేశం నిర్వహించారు.
రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, బేతంచెర్ల మండలానికి సంబంధించిన వైఎస్ఆర్సిపి, టీడీపీ, జనసేన, సిపిఐ పార్టీలకు చెందిన సోషల్ మీడియా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు.

- Advertisement -

ఈ సమావేశంలో సోషల్ మీడియా ప్రతినిధులకు క్రింది సూచనలు ఇచ్చారు. అవి ఏవనగా, ఎవ్వరూ కూడా సోషల్ మీడియా (ఫేస్బుక్ , వాట్సాప్ , ట్విట్టర్ , ఇంస్టాగ్రామ్) వేదికగా వ్యక్తిగత దూషణలు, అసభ్య పద జాలాలు, మతాలను, కులాలను, వర్గాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం గాని, పోస్టులు పెట్టడం గానీ చెయ్యరాదన్నారు.

అలాగే ఫేక్ వార్తలను, షేర్ చేయడం, పోస్ట్ చేయడం, ఫార్వర్డ్ చేయడం లాంటివి చేయకూడదన్నారు. రాజకీయ పార్టీలను, పార్టీలోని వ్యక్తులను, రాజ్యాంగబద్ద వ్యవస్థలను, వ్యక్తులను దూషిస్తూ, అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టరాదన్నారు. రెచ్చగొట్టే విధంగా మాట్లాడే వారిపైన, పోస్టులు పెట్టిన వారిపైన జిల్లా కేంద్రం నుండి నిఘా వుంటుందని, వారిపైన పోలీస్ శాఖ తగిన చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా వారికి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సీఐ ప్రియతమ్ రెడ్డి, ఎస్ ఐ శివ శంకర్ నాయక్ పోలీస్ సిబ్బంది, వివిధ పార్టీలకు చెందిన సోషల్ మీడియా సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News