వైఎస్సార్ సీపీ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని వైఎస్సార్ సీపీ సమన్వయకర్త విరుపాక్షి అన్నారు. వైఎస్సార్ సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆలూరులో కేక్ కట్ చేసి వైఎస్సార్ సీపీ నాయకుల పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త విరుపాక్షి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం సీఎం జగన్ మోహన్ రెడ్డి పార్టీని స్థాపించారని ఆయన తెలిపారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్య ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో అందుతున్నాయని ఆయన తెలిపారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ప్రజల కష్టాలను చూసి నవరత్నాలు భాగంగా అమ్మ ఒడి, వైయస్సార్ చేయూత, వైయస్సార్ ఆసరా, రైతు భరోసా, తదితర సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాల ప్రజలను అభివృద్ధి చేసిన ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని ఆయన తెలిపారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డికి పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక టిడీపీ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ కి 175 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులు కార్యకర్తలు పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతం ఆలూరు పట్టణంలో పర్యటించారు పట్టణంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సమస్య, సీసీ రోడ్లు డ్రైనేజీ కాలువలు నిర్మాణానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఏరురూ శేఖర్, మండల కన్వీనర్ చిన్న ఈరన్న, కో కన్వీనర్ వీరేష్, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.