మోదీ ప్రభుత్వం గ్యారెంటీలో బాగంగా భారత రైల్వే ఆధునికరణ కార్యక్రమంలో సుమారు 85 వేల కోట్ల రూపాయలకు పైగా విలువైన రైల్వే ప్రాజెక్టు పనులకు గుజరాత్ రాష్ట్రంలోని అహమ్మదాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేశారని హైదరాబాద్ డివిజన్ డిఈఎన్ (లైన్స్) అరుణ్ కుమార్ శర్మ తెలిపారు.
భారత ప్రభుత్వం యొక్క గ్యారెంటీ కార్యక్రమాలలో భాగంగా భారత రైల్వే ఆధునికరణ కార్యక్రమం గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నుండి 85 వేల కోట్ల రూపాయలకు పైగా విలువైన రైల్వే ప్రాజెక్టు పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన నిర్వహించి జాతికి అంకితం చేసిన కార్యక్రమాన్ని కర్నూలు రైల్వే స్టేషన్ నుంచి లైవ్ ప్రోగ్రాంను వీక్షించిన ఇండియన్ రైల్వే హైదరాబాద్ డివిజన్ డిఈఎన్ లైన్స్ అరుణ్ కుమార్ శర్మ, ఏడిఎస్టియు భాస్కర్, చాంబర్స్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ రెడ్డి, DRUCC మెంబర్ డి వెంకట్ రాజు, తదితరులు పాల్గొన్నారు. ఈ సదర్భంగా హైదరాబాద్ డివిజన్ డిఈఎన్ లైన్స్ అరుణ్ కుమార్ శర్మ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ దాదాపు 240 గూడ్స్ షెడ్‌లు, 69 కంటే ఎక్కువ గతి శక్తి మల్టీ మోడల్ కార్గో టెర్మినల్స్, సుమారు 69 రైల్ కోంచ్ రెస్టారెంట్లు మరియు 900 కంటే ఎక్కువ ఒక స్టేషన్ వన్ ప్రోడక్ట్ (OSOP) స్టాల్స్, ట్రాలీలు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు అంకితం చేశారన్నారు.
గూడ్స్ షెడ్‌లకు సరైన అప్రోచ్ రోడ్లు, లారీల కు ఇబ్బంది లేని రాకపోకలకు అనువైన మార్గం , తగినంత లైటింగ్ ఏర్పాట్లు, మర్చంట్ రూమ్, హమాలీల కోసం విశ్రాంతి గది మొదలైన వాటిని అభివృద్ధి చేయడం ద్వారా ఫ్రైట్ టెర్మినల్స్‌లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి భారతీయ రైల్వే కట్టుబడి వుంటుందన్నారు. ఇది టెర్మినల్స్ నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుతుందని వ్యాగన్ టర్న్‌అరౌండ్‌ని మెరుగు పరచి ప్రజలను సంతృప్తి పరచడం జరుగుతుందన్నారు. స్థానిక కళాకారులు, కూలీలు, నేత కార్మికులు, చేనేత కార్మికులు, గిరిజనులు, రిజిస్టర్డ్ స్వయం సహాయక బృందాలు మరియు MSME కింద నమోదైన చిన్న పరిశ్రమల జీవనోపాధి మరియు సంక్షేమాన్ని పెంపొందించడానికి, వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ స్కీమ్ “లోకల్ ఫర్ లోకల్” అనే థీమ్‌తో ప్రవేశపెట్టబడిందని అన్నారు. స్టేషన్‌లలో ప్లాట్‌ఫారమ్‌లపై స్టాల్స్ కోసం కేటాయించిన స్థలం మాధ్యమం ద్వారా మార్కెటింగ్ ఛానెల్. ఇది స్థానిక, స్వదేశీ ఉత్పత్తులకు మార్కెట్‌ను అందిస్తుందని, నిర్దిష్ట ప్రాంతానికి విభిన్నమైన స్థానిక హస్తకళలు, కళాఖండాలు, చేనేత వస్ర్తాలు మొదలైన వాటికి అదనపు ఆదాయ అవకాశాలను సృష్టిస్తుంది అని ఆయన అన్నారు.
అనంతరం కర్నూల్ సిటీ రైల్వే స్టేషన్లో కర్నూల్ సిటీ ఒక్క స్టేషన్ ఒక్క ఉత్పత్తి కి సంబంధించిన పైలాన్ ను హాజరైన అతిధులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏడిఎస్టియు భాస్కర్, చాంబర్స్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ రెడ్డి, DRUCC మెంబర్ డి వెంకట్ రాజు, చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ మున్నా జీరావ్, స్టేషన్ మేనేజర్ శేషపణి. బిజెపి ప్రతినిధులు నగరూరు రాఘవేంద్ర, శ్రీరామ్ యాదవ్,శ్రీమతి గీతా మాధురి, ఐఎన్టియుసి ప్రెసిడెంట్.. బి బతుకన్న తదితరులు పాల్గొన్నారు.