Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: మాచాని సోమప్ప మార్గంలో నడుద్దాం

Emmiganuru: మాచాని సోమప్ప మార్గంలో నడుద్దాం

ఎమ్మిగనూరుకు గౌరవం తెచ్చారు

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో చేనేతల జీవన ప్రమాణాలను పెంచడానికి పద్మ శ్రీ మచాని సోమప్ప కృషి చేశారని వారి ఆశయాలు కొనసాగించాలని అలాగే బీసీ నినాదాన్ని ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనను స్వాగతించాలని మాజీ పార్లమెంట్ సభ్యురాలు, ఎమ్మిగనూరు వైకాపా సమన్వయ కర్త బుట్టా రేణుక అన్నారు. స్థానిక వీవర్స్ కాలని గ్రౌండ్ లో ఎమ్మిగనూరు నియోజకవర్గ స్థాయి చేనేత భాందవ్యుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. నేతన్న నేస్తం ద్వారా ఆర్థిక సాయం చేస్తున్నారు. విద్య ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు. మనం చట్ట సభలకు వెళ్ళాలి. అందుకే బిసిలకు అవకాశం ఇచ్చారు. చేనేతలకు అవకాశం వచ్చింది. దీనిని సద్వినియోగం చేసుకోవాలి. నన్ను గెలిపించి అసెంబ్లీకు పంపితే మన సమస్యలు పరిష్కారం అవుతాయి.

- Advertisement -

కర్నూలు ఎంపి అభ్యర్థిగా బిసికు ఇచ్చారు. మాచాని సోమప్ప మార్గంలో నడుస్తాం. మన ప్రాంతాన్ని మనమే అభివృద్ధి చేసుకుందాం. మనల్ని విడగొట్టలని చూస్తున్నారు. దీనిని గ్రహించి నన్ను ఆదరించి గెలిపించాలని కోరారు.

కార్యక్రమంలో వైకాపా నాయకులు బుట్టా శివ నీలకంఠ, బుట్టా ప్రతుల్, కుర్ని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నక్కలమిట్ట శ్రీనివాసులు, షాప్ నెట్ ఏపి చైర్మన్ మచాని వేంకటేశ్వర్లు, ఉకుర్ని కార్పొరేషన్ చైర్మన్ బుట్టా శారదమ్మ, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రఘు, చేనేత కార్మిక సంఘాల నాయకులు, కుర్ని సంఘం పెద్దలు కామర్థి నాగే షప్ప , శివ ప్రసాద్, గడిగే లింగప్ప, బండారు ఆనంద్ ప్రసాద్, డాక్టర్ శిల్పా, నీలకంఠ, స్వాతి, వినయ్, శివదాసు, విశ్వనాథ్ రమేష్, పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News