జమ్మికుంట తహసిల్దార్ గా విధులు నిర్వర్తిస్తున్న రజిని ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించడం సంచలనం రేకెత్తిస్తోంది. హనుమకొండలోని కేఎల్ రెడ్డి కాలనీలో నివాసముంటున్న తహసిల్దార్ రజినీ ఇంట్లో, ఆమె బంధువుల ఇళ్లలో ఏకకాలంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బుధవారం తెల్లవారుజాము నుంచి సోదాలు జరుపుతున్నారు. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ మండలాల్లో పనిచేసిన ఆమె ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటలో తాసిల్దారుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఏసీబీ అధికారులు తహసిల్దార్ ఇంట్లో, ఆమె బంధువుల ఇళ్లలో సోదాలు చేపట్టినట్లు సమాచారం. ఏసీబీ అధికారులు ఎవరినీ ఇంట్లోకి అనుమతించడం లేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Jammikunta: జమ్మికుంట తహసిల్దార్ రజని ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
సంబంధిత వార్తలు | RELATED ARTICLES