రెడ్డి హక్కుల కోసం, రెడ్డి కార్పొరేషన్ కోసం గత తొమ్మిదేళ్లుగా చేస్తున్న పోరాటాన్ని గుర్తించి, రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వనికి రెడ్డి సంఘం నాయకులు బద్దం. శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రెడ్డి కార్పొరేషన్ సాధనలో ఎన్నో సార్లు అరెస్టులు , నిర్బంధనలు ఎదుర్కున్నామని అవన్ని పోరాటాలకి ఈ రోజు పలితం అని, గత ప్రభుత్వం 2018 మేనిఫెస్టో లో ప్రకటించి కూడా గెలిచాక ఏర్పాటు చేయకుండా రెడ్లని మోసం చేశారని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ 100 రోజుల లోపే కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ప్రభుత్వ పనితీరుకి నిదర్శనం అని కొనియాడారు. పేద రెడ్లు ప్రభుత్వానికి రుణపడి ఉంటారని కార్పొరేషన్ తో పేద రెడ్లకి ప్రభుత్వ భరోసా ఇవ్వడం హర్షించదగ్గ విషయం అని కార్పొరేషన్ ఏర్పాటుకి సహకరించిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి, రాష్ట్ర మంత్రి వర్గానికి, ప్రభుత్వ పెద్దలకి, సహకరించిన ఎమ్మెల్యేలకి నాటి నుండి కార్పొరేషన్ సాధనలో పోరాడిన అన్ని రెడ్డి సంఘాలకి కృతజ్ఞతలు తెలిపారు.