తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రసంగించారు. రాష్ట్రం అన్ని రంగాల్లో చారిత్రాత్మక విజయం సాధించిందని, రాష్ట్ర తలసరి ఆదాయం గణనీయంగా పెరిగిందని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. సంక్షేమం అభివృద్ధిలో దేశానికే తెలంగాణ సర్కారు రోల్ మోడల్ గా నిలిచి, నంబర్ వన్ గా ఎదిగిందన్నారు. రైతు బంధు, దళత బంధు, ఆసరా పెన్షన్లు, మిషన్ భగీరథ వంటి పథకాలు రాష్ట్రం గుణాత్మక అభివృద్ధికి సహకరించాయన్నారు. కోటి ఎకరాలకు నీరందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు.
Hyd: గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమైన తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES