Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: ఎమ్మిగనూరు టిడిపి టికెట్ బీవీకే

Emmiganuru: ఎమ్మిగనూరు టిడిపి టికెట్ బీవీకే

చంద్రబాబు నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

విశ్వసనీయత నమ్మకానికి టిడిపి అధిష్ఠానం పట్టం కట్టింది. తెదేపా ప్రకటించిన రెండవ జాబితాలో ఎమ్మిగనూరు టిడిపి అభ్యర్థిగా బీవీ జయనాగేశ్వర రెడ్డి పేరును ఖరారు చేసింది. దాదాపు నెల రోజులుగా టిడిపి టికెట్ పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చివరికి మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి వైపే మొగ్గు చూపింది.

- Advertisement -

ఇది బీవీ రాజకీయ ప్రస్థానం.

మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి టిడిపి అవిర్భవం నుండి నమ్మకంగా పని చేశారు. ఆయన మరణానంతరం ఆయన తనయుడు ఎమ్మిగనూరు నియోజకవర్గ టిడిపి బాధ్యతలు చేపట్టారు. తండ్రి బాటలో తనయుడు నడిచారు. 2014 లో టిడిపి నుండి పోటీ చేసిన బీవీ జయనాగేశ్వర రెడ్డి వైకాపా అభ్యర్థి ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డిపై విజయం సాధించాడు. 2019లో జరిగిన ఎన్నికలలో టిడిపి నుండి పోటీ చేసి వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజలలో ఉంటూ టిడిపి శ్రేణులను కాపాడుకుంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేశారు.

సంబరాలు..

సమీకరణలు, సర్వే నివేదికలు క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిగణనంలోకి తీసుకుని టిడిపి టికెట్ ను బీవీ జయనాగేశ్వర రెడ్డికు కేటాయించింది. జయనాగేశ్వర రెడ్డికు టిడిపి వచ్చినట్లు తెలియడంతో బీవీ అభిమానులు టిడిపి శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. బీవీ నివాసానికి భారీగా చేరుకొని జయనాగేశ్వర రెడ్డి కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం టిడిపి నాయకులు కార్యకర్తలు స్థానిక సోమప్ప , సర్కిల్ తో పాటు పట్టణంలోని వివిధ వార్డుకు ఎమ్మిగనూరు,నందవరం, గోనెగండ్ల మండలాల గ్రామంలో బాణా సంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీవీ జయనాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ నాపై నమ్మకం తో సీటు కేటాయించిన చంద్ర బాబు, నారా లోకేష్ కు రుణ పడి ఉంటానన్నారు. నమ్మకానికి అనుగుణంగా గెలిచి కానుకగా ఇస్తాననని..విశ్వసనీయత నమ్మకంగా పార్టీ ను నమ్ముకున్న వారి సేవలను గుర్తించి టికెట్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు బీవీ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News