కర్నూలు జిల్లాలోని 7 నియోజకవర్గాలలో టిడిపి అభ్యర్థులలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ఒక్కరే ఉండటం టిడిపి అధిష్టానానికి బీవీ కుటుంబానికి మధ్య ఉన్న నమకం ఎలాంటిదో అర్థం అవుతుంది.
మారుతున్న సామాజిక సమీకరణాలు..
ఇందుకు ఉదాహరణ ఎమ్మిగనూరు టిడిపి అభ్యర్థిగా మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి తనయుడు మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డిను ఎంపిక చేయడమే. కర్నూలు జిల్లాలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ టిడిపి వైసిపితో పాటు ఇతర పార్టీల రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చేవి. ఇందులో ఎస్సీ రిజర్వేషన్ సీట్లు మినహాయించి మిగతా సీట్లు ఆ వర్గానికి ఇచ్చేవి. కానీ ఈ సారి ఎన్నికలలో మాత్రం టిడిపి వైసిపిలు బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం మార్పుకు నిదర్శనం.
ఒకే ఒక్కడు..
జిల్లాలో రెడ్లలలో టిడిపి టికెట్ దక్కించుకున్న ఒకే ఒక్కడు బీవీ జయనాగేశ్వర రెడ్డి. తెదేపా చంద్రబాబు , ఎన్టీఆర్ కుటుంబాలని మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి అత్యంత నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు. అదే నమ్మకాన్ని బీవీ జయనాగేశ్వర రెడ్డి కొనసాగిస్తున్నాడు. చంద్రబాబు, నారా లోకేష్ తో పాటు నందమూరి కుటుంబానికి చెందిన నందమూరి బాలకృష్ణకు జయనాగేస్వర రెడ్డి నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు. ఇందులో భాగంగా బీవీ వారసుడిగా బీవీ జయనాగేశ్వర రెడ్డి సీటు దక్కించుకున్నాడు.
తండ్రి వారసత్వం పుణికి పుచ్చుకున్న కుమారుడిగా..
బీవీ మోహన్ రెడ్డికు తగ్గట్లు బీవీ జయానాగేశ్వర రెడ్డి కూడా ప్రజలలో ఆదరణ అభిమానాన్ని పొందారు. లేకపోతే జిల్లాలో అనేక మంది రెడ్లు ఉన్నప్పటికీ బీవీ జయనాగేశ్వర రెడ్డి ఒక్కరికే టికెట్ దక్కడం వారి కుటుంబానికి టిడిపికు మధ్య ఉన్న నమ్మకమైన అనుబంధమే. కర్నూలు టీజీ భారత్ , కోడుమూరు బొగ్గుల దస్తగిరి( ఎస్సీ), పత్తికొండ కేఈ శ్యామ్ బాబు( ఈడిగ)( బీసీ), మంత్రాలయం రాఘవేంద్ర రెడ్డి( వాల్మికి) బీసీ, ఎమ్మిగనురు బీవీ జయనాగే శ్వర రెడ్డి (రెడ్డి) లకు సీటు కేటాయించారు.
ఆలూరు, ఆదోనిలకు ఇంకా ఖరారు చేయలేదు. ఆదోనికి బిజేపి తరుపున రమేష్ (ఆర్యవైశ్య) ,జనసేన నుండి మళ్ళప్ప (బలిజ ), టిడిపి నుండి మీనాక్షి నాయుడు, గుడిసే కృష్ణమ్మ, మదిరి భాస్కర్ రెడ్డి సీటు అడుగుతున్నారు. ఏది ఏమైనా జిల్లాలోని రెడ్ల లో ఒక బీవీ జయనాగేశ్వర రెడ్డికు సీటు దక్కడం బీవీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.