ఏ క్షణమైనా లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్ ఉంది. ఖాళీగా ఉన్న రెండు ఎన్నికల కమిషనర్ పోస్టులను నిన్న కేంద్రం భర్తీ చేయగా ఈరోజు వారు తమ అధికార బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల కమిషనర్లుగా జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ (ఇద్దరూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారులే) బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఇక పార్లమెంట్ ఎన్నకలకు నోటిఫికేషన్ జారీ అయ్యేందుకు మార్గం మరింత సుగమం అయింది. ఆర్టికల్ 370 రద్దులో జ్ఞానేష్ కీలక పాత్ర పోషించగా, ఉత్తరాఖండ్ లో సీఏఏ అమలులో సుఖ్బీర్ కీలక పాత్ర పోషించిన అధికారి కావటంతో వీరిద్దరి ఎంపికపై ప్రతిపక్షాలు గుర్రుగా ఉన్నాయి. దీంతో అందరి కళ్లూ ఈసీపైనే ఉన్నాయి.