Saturday, October 5, 2024
Homeపాలిటిక్స్Sudeep: కాంగ్రెస్ లోకి హీరో కిచ్చా సుదీప్?

Sudeep: కాంగ్రెస్ లోకి హీరో కిచ్చా సుదీప్?

కాంగ్రెస్ పార్టీకి కిచ్చా సుదీప్ మరింత దగ్గర అవుతున్నారా అంటూ ఆయన అభిమానులు ఆలోచనలో పడ్డారు. కిచ్చా సుదీప్ ఇంటికి స్వయంగా కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్ రావటంతో ఈ తాజా చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ భేటీపై ఇటు డీకే శివకుమార్ అటు సుదీప్ వర్గాలు ఏ ప్రకటనా చేయకపోవటం విశేషం. రానున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో సుదీప్ కాంగ్రెస్ టికెట్ పై బరిలో దిగుతారా లేక కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారంలోకి స్టార్ హీరో దిగుతారా అంటూ ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. నిజానికి కిచ్చాసుదీప్ కు, డీకే శివకుమార్ కు మధ్య చాలా అనుబంధం ఉంది. గత కొన్నేళ్లుగా వీరి దోస్తీ సాగుతోంది. కన్నడలో మోస్ట్ పాపులర్ యాక్టర్ అయిన సుదీప్ ప్యాన్ ఇండియా స్టార్ గా రాణిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News