Friday, November 22, 2024
Homeపాలిటిక్స్Tandur: పైలెట్ చూపు బీజేపీ వైపేనా?

Tandur: పైలెట్ చూపు బీజేపీ వైపేనా?

కేసులకు భయపడి

తాండూరులో మలుపు తిరుగుతున్న రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. దేశంలో తాండూరు అంటే తెలియని వారు ఉండరు, ఎందుకంటే తాండూరు నాపరాయి, కందిపప్పుకు దేశవ్యాప్తంగా పేరుంది. అదేవిధంగా తెలంగాణ రాజకీయాల్లో వివాదాస్పద నేతగా పైలట్ రోహిత్ రెడ్డి అంటే తెలియని వారు ఉండరు.

- Advertisement -

ఫామౌస్ కేసులో..

ఒకప్పుడు మొయినాబాద్ ఫామౌస్ కొనుగోలు కేసులో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తాండూరు తాజా మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిదే. బిజెపి తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని రూ.100/- కోట్లకు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేసినా, తను అమ్ముడు పోకుండా కొనుగోలు చేసేందుకు వచ్చిన వారికి పోలీసులకు పట్టించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈడీ కేసులో కూడా పైలెట్ ఒక విధంగా న్యూస్ మేకర్ అయ్యారు. ఈడీకి తనకు ఎలాంటి సంబంధాలు లేవు, నన్ను కావాలని కేంద్ర ప్రభుత్వం 100 కోట్లకు కొనాలని చూసినా.. నేను లొంగలేదు అని బీజేపీని నుంచి తనను కొనుగోలు చేసేందుకు వచ్చిన వారికి తగిన గుణపాఠం చెప్పి, బీజేపీని ఎండకట్టానని ఈయన తరచూ చెప్పుకుంటూ ఉంటారు.

ఈడీ దెబ్బకు..

కుట్ర పన్ని, తనను ఇరికించేందుకు ఈడీ కేసుల్లో లాగారని రోహిత్ రెడ్డి మీడియా ముందు తెగ చెబుతుంటారు కూడా. తాజాగా బిఆర్ఎస్ శాసనసభ ఎన్నికల్లో అధికారం కోల్పోయింది. అదేకాకుండా పైలెట్ కూడా తాండూరులో ఓటమికి గురయ్యారు. నా ఓటమికి కారణం నా పక్కనే ఉంటూ ఓ నాయకుడు ద్రోహం చేసాడు అని ఎన్నికల అనంతరం కొన్ని సార్లు మీడియా సమావేశంలో చెప్పుకున్నారు కూడా. ఇప్పుడు మరొక్కమారు రోహిత్ రెడ్డిపై ఈడీ కేసులు లాగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పుకార్లు వినిపిస్తున్నాయి. బిఆర్ఎస్ అధికారంలో లేకపోయే. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. రోహిత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్ళలేని పరిస్థితి. దీంతో ఇక మిగిలిన ఆప్షన్ బీజేపీ అన్నట్టు పరిస్థితి మారినట్టు తెలుస్తోంది. దీంతో తప్పని పరిస్థితుల్లో ఈయన బీజేపీలోకి వెళ్తున్నట్లు జోరుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. బీజేపీలోకి రోహిత్ రెడ్డితో సహా మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు పార్టీ మారెేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

ప్రతీకార రాజకీయాలేనా?

శాసనసభ ఎన్నికల్లో రోహిత్ రెడ్డిని ఓటమికి గురిచేసిన వారిపై పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతీకారం తీర్చుకొనేందుకు బీజేపీతో చేతులు కలుపుతునట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రూ.100 కోట్లకు అప్పుడు అమ్ముడు పోని రోహిత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు బీజేపీలోకి చేరుతాడు అనేది నియోజకవర్గ వ్యాప్తంగా ఈ రూమర్స్ పై చర్చ సాగుతోంది. రాజకీయంగా గడ్డు కాలం ఎదుర్కొంటున్న ఆయన, ఈడీ చిక్కుల నుంచి శాశ్వతంగా బయటపడేందుకు బీజేపీ కండువా కప్పుకునేందుకు సై అంటున్నట్టు ఒకటే హాట్ టాపిక్ తాండూరులో వైరల్ అవుతోంది. దీనిపైన పైలట్, ఆయన మద్దతుదార్లు ఏ కామెంట్స్ చేయకపోగా ఖండించటం కూడా లేదు. అంటే రూమర్లో కాస్తైనా నిజం ఉందని ఇక్కడి ఓటర్లు తెగ ఇదై పోతున్నారు.

మరి బీజేపీలోకి రానిస్తారా?

పైలెట్ బీజేపీలోకి వెళ్లేందుకు లైన్ క్లియర్ గా ఉన్నప్పటికీ బీజేపీ అధిష్టానం ఇందుకు సిద్ధంగా ఉందా? బీజేపీపై సెడామడా ఆరోపణలు ఆరోజు చేసిన పైలట్ ను చేర్చుకుంటే ఇతర కమలం లీడర్లు ఏమనుకుంటారు? అసలు తాండూరు ప్రజలు, తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు? ఇవన్నీ మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారాయి. అయితే పార్లమెంట్ బరిలో నించుని ప్రత్యర్థులకు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలనేది రోహిత్ అసలు స్కెచ్చా? ప్రస్తుతానికి రోహిత్ రెడ్డి క్యాంప్ నుంచి నో అప్డేట్స్.. మరికొన్ని గంటల్లో క్లారిటీ అయితే వచ్చే ఛాన్స్ వందశాతం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News