Sunday, October 6, 2024
Homeచిత్ర ప్రభiphone: ఐ ఫోన్ తో విశాల్ భరద్వాజ్ సినిమా

iphone: ఐ ఫోన్ తో విశాల్ భరద్వాజ్ సినిమా

ఐ ఫోన్ 14 ప్రోతో సినిమా మొత్తం షూట్ చేసినట్టు విశాల్ భరద్వాజ్ వెల్లడించటం విశేషం. ఇషాన్ ఖట్టర్, వామికా గబ్బి ప్రధాన పాత్రలు పోషించిన ఫుర్సత్ సినిమాను ఐ ఫోన్ తో ఎండ్ టు ఎండ్ తెరకెక్కించినట్టు విశాల్ తెలపటం హైలైట్. విమర్శకుల ప్రశంసలు పొందే దర్శకుడిగా బాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ఉన్న భారీ బడ్జెట్ డైరెక్టర్ విశాల్ ఐఫోన్ తో టై అప్ అయ్యారు. ఈ క్రమంలో ఆపిల్.కాం కోసం ఆయన ఓ 30 నిమిషాల నిడివి ఉన్న షార్ట్ ఫిలిం ఫుర్సత్ పేరుతో తెరకెక్కించారు.

- Advertisement -

ఈ సినిమాలో ఫక్తు బాలీవుడ్ కమర్షియల్ సినిమాలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. వీటితో పాటు అండర్ వాటర్, డెజర్ట్, ట్రైన్ వంటి పలు బ్యాక్ గ్రౌండ్లలో సినిమాను షూట్ చేశారు. సంప్రదాయ సినిమా షూటింగ్ విషయానికి వస్తే అది 10 మంది మనుషులు, ముగ్గురు అటెండెంట్స్, 10 బాక్సుల లెన్సులు వంటివన్నీ అవసరమని, కానీ ఐఫోన్ తో చాలా సింపుల్ గా, ఈజీగా షూట్ చేసేశాం అంటూ విశాల్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News