Saturday, October 5, 2024
Homeఓపన్ పేజ్Women empowerment: నారీ శక్తిలో కనిపించని సాధికారిత

Women empowerment: నారీ శక్తిలో కనిపించని సాధికారిత

అన్నీ స్పీచులకే పరిమితం

యదార్థ వాధి లోక విరోధి అయినా పర్వాలేదు. నేడు మహిళలకు జరుగుతున్న అన్యాయాలను అసమానతలను తూర్పార పట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మగువలలో చైతన్యం తీసుకొని రావాలి. జ్యోతి రావు పూలే సావిత్రి భాయి పూలేలు పుట్టుకొని రావాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు దశాబ్దాలుగా జరుపుకుంటున్న మహిళా సాధికరిత ఏపాటి సాధించిందో ప్రశ్నించు కోవలసిన అవసరం ఉంది.. రాజకీయముగా సామాజికంగా ఆర్థికంగా స్త్రీలను బలోపేతం చేసిందా ! తగిన సమయములో తగిన నిర్ణయం తీసుకుంటూ తమ పరిధి మేర ఇష్టాలను ఎంచుకునే స్థితికి స్త్రీ ఎదిగిందా! నైపుణ్యాలను మెరుగు పరుచుకునే అవకాశం ప్రభు త్వం కల్పించుతుందా!

- Advertisement -


ఆడ శిశువుల హత్యలు లింగ వివక్ష స్త్రీ ఆరోగ్యం అక్ష రాస్యత వంటి అంశాలలో నారీ శక్తిగా మారి ఉద్యమాలు చేస్తు న్నారా! ఎదురొడ్డి పోరాడుతున్నారా! ప్రశ్నించే తత్వం అలవర చుకున్నారా! మూడు సార్లు తలాక్‌ చెప్పే విధానాన్ని ఎందు కు ఖండించడం లేదు? సామాజిక కార్యకర్త ‘మేధా పాట్కర్‌’ ను స్ఫూర్తిగా తీసుకొని మహిళలు ఉద్యమించాల్సిన అవసరం ఇంకా ఉంది. మహిళా సాధికరిత గురించి ప్రభుత్వం చేస్తున్న పనులు ఏమిటి ! అవి ఎంత వరకు అమలు చేస్తున్నారు అన్న విషయాలు మగువలు తెల్సుకోవాలి. స్త్రీ సమానత్వానికి నడుం బిగించాలి సాధికారిత లో భాగముగా మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ చేపట్టిన కార్యక్రమాలు ఎన్నో ఉన్న అమలు కు నోచుకున్నాయా! ప్రధాన మంత్రి వందన యోజన ‘భేటీ బచావో భేటీ పడావో అన్నది పేపర్‌ కే పరిమితం అయింది రోడ్లపై చెత్త కుండీలలో బాలికలు ఎంగిలి మెతుకులు ఏరుకొని తింటున్నారు. ‘చైల్డ్‌ ప్రొటెక్షన్‌ సర్వీసెస్‌’ లేనే లేదు ఆకలి చావుల సంఖ్య గిన్నీస్‌ బుక్‌లో ఎక్కుతుంది. మత మౌఢ్యం పెచ్చు పెరిగి పాలకులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. కౌమార బాలికల పథకం, ఉజ్జ్వల పథకం, మొదలైన సంక్షేమ పథకాలు ‘బూడిదలో పోసిన పన్నీరే’ అవుతున్నాయి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. మహిళా సాధికారితపై జి 20 అంతర్జాతీయ సమావేశాలు ఏమి ఉద్దరించినాయి. ప్రఖ్యాతి చెందిన మహిళలు ప్రసంగించిన మహిళలకు పురుషులకు సమానముగా సమానత్వం ఉందా? మహిళల ఆలోచనలో మార్పు ఇంకా రావలసి ఉంది. జాతీయ విద్యా విధానములో లింగ సమానత్వానికి ప్రాధాన్యత ఎక్కడ ఉంది? హత్యలు రేప్‌లు వేధింపులు బాల్య వివాహాలు లింగ నిర్ధారణ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మహిళలు సంఘ సంస్కర్తలుగా పనిచేయుట కంకణం కట్టుకోవాలి అంబేడ్కర్‌ ఆశయాలతో ప్రజాస్వామ్యం ఫరిడవిల్లాలి. మానవీయ విలువలు చిగురిం చాలి మగువ బతుకులు చితికిన అతుకులు కాకూడదు. అక్ష రాస్యత ఉన్న వాళ్ళలో ప్రశ్నించేతత్వం విజ్ఞాన స్పృహ కొరవడి మూఢ నమ్మకాలను నమ్మి జీవితాలను బలి చేసుకొంటున్న సంఘటనలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దేవుని అవతారం ఎత్తిన దొంగ బాబాల దగ్గర చేరి వారిని బజిం చిన మగువలు రేప్‌లకు గురి అవుతున్నారు. ఇది ఎవరి తప్పు? బాబాలను గుడ్డిగా ఎందుకు నమ్మాలి? అతీత శక్తులు ఉంటే వారే బాగు పడచ్చు కదా! వారు వేసిన వలలో మనము ఎం దుకు చిక్కు కోవాలి మన మేధస్సును ఎంతవరకు ఉపయోగిం చుతున్నాం మనమే ప్రశ్నించు కోవాలి. కాషాయ వస్త్రాలు ధరించి గడ్డాలు మీసాలు పెంచి ప్రజలను మోసం చేసే సన్నా సులు కరడు గట్టిన నేరస్థులు కాదా? దేశములో పడి దోచు కుంటున్న దొంగలు కాదా? ఇటువంటి వారిని పెంచి పోషిం చేది మనమే ఇది గమనించదగిన విషయం. మన జీవితం మన చేతిలోనే ఉందన్న విషయం ఇంకెప్పుడు తెలుసుకొంటారు.
మానవుని పుట్టుక, జీవపరిణామ సిద్ధాంతము గురించి అవగాహన కలిగి ఉండాలి. శాస్త్రీయ దృక్పథం అలవరచు కోవాలి. విశ్వ రహస్యాలు ఛేదించి న శాస్త్రవేత్తల గురించి తెలు సుకుంటే నిప్పులాంటి చేదు నిజం బయటపడి కరడు గట్టిన మూఢత్వం కనబడకుండా పోతుంది. ప్రజలు కళ్ళు తెరిస్తే బాబాల స్వామీజీల పుట్టుక అంతరించి పోతుంది. అప్పుడే దేశం బాగుపడుతుంది. పురుషునితో సమానముగా స్త్రీలకు మనిషిగా జీవించే హక్కు భారత రాజ్యాంగం ఇచ్చింది. బానిస బతుకులు ఇంకా ఎందుకు బతుకాలి! ఇంటిలో గాని బయట ప్రపంచములో గాని స్త్రీలను అణచి వేసే ధోరణి ఉంటే సహిం చేది లేదు. బూజు పట్టిన సంప్రదాయాలు అచారాలు స్త్రీలను బలి పశువులుగా చేస్తున్నాయి. వాటిని ఎదుర్కోవాలి వీరవని తలను స్ఫూర్తిగా తీసుకోవాలి. బాల్య వివాహాలు చేసుకొని చిన్న వయసులో భర్తను కోల్పోయి పునర్వివాహం చేసుకో కుండా స్త్రీల అమూల్య జీవితాలను నాశనం చేసుకొంటు న్నారు. మహిళల ఆలోచన విధానములో మార్పు ఖచ్చితముగా రావాలి. ఇటీవల మహిలసాధికరత పట్ల ప్రభుత్వం చూపిన వైఖరికి సుప్రీం కోర్ట్‌ చురకలు అంటించింది. ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ మహిళా అధికారులకు శాశ్విత కమిషన్‌ నిరాకరించిన దానిని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ పై విచారణ సందర్భ ముగా కేంద్రానికి సుప్రీం కోర్టు అక్షింతలు వేసింది. అర్హులైన షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ పెర్మనెంట్‌ కమిషన్‌ ఏర్పాటు చేయడా నికి అనుమతి లభించక పోవడంతో ప్రియాంక త్యాగి అనే అధి కారిని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై ధర్మాసనం విచారణ జరిపింది. మాట్లాడితే నారీ శక్తి నారీ శక్తి అంటారు దానిని ఇక్కడ చూపించండి ఆర్మీ నేవీలో సాద్యమైనప్పుడు కోర్ట్‌ గార్డ్‌లో ఎందుకు వివక్ష ఉదాసీన వైఖరి ఎందుకు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. స్త్రీ పురుష సమానత్వం ఉన్న విధా నాన్ని రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. సామాజిక నిబంధనలు శారీరక పరిమితులు అనే ప్రభుత్వ వాదనను సుప్రీం తిరస్కరించి చెంపదెబ్బ కొట్టింది.
కేవలం ప్రభుత్వం హడావుడిగా ఉత్సవాలు జరిపి ఉప న్యాసాలు ఇస్తే సరిపోతుందా? లింగ సమానత్వం ఆచరణలో చూపాలి అంటే మహిళలలు చేయి చేయి కలుపాలి. ఉద్యమా లకు శంఖారావం ఊదాలి. ఆడవారిని దేవతలుగా పూజించా ల్సిన అవసరం లేదని మనిషి గా చూస్తే చాలు. వేద మంత్రాలు జిలకర బెల్లం అప్పగింతల సందడి అరుంధతి నక్షత్రం ఎం దుకు మహిళను కట్టి వేసి ఊడిగం చేయించుకోవడానికేనా? ఆడవారిని నల్లిని నలిచినట్లు నలపడానికేనా? పురుషాధిక్యత ఉన్న వారిని నిగ్గ దేసి నిలదీసి అడగాలి . లింగ భేదం ఎందుకు స్త్రీ మనిషి కాదా భావోద్రేకాలు పురుషుని లాగా ఉండవా? ఎన్నో రకాలుగా పిలువబడుతు కుటుంబంలో కీలక పాత్ర వహించుతున్న మగువలను ఆటవస్తువుగా పురుషులు వాడు కుంటున్నారు వారి ఆలోచన శైలి మారాలి మహిళా సాధికా రిత సంపూర్ణముగా సాధించుకున్నప్పుడే అంతర్జాతీయ మహి ళా దినోత్సవాలకు ఊపు వస్తుంది. మహిళల కళ్ళలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఆ మంచి రోజులు వస్తాయని ఆశిద్దాం.

  • పూసాల పద్మ
    9014312495
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News