Saturday, October 5, 2024
Homeఓపన్ పేజ్Telangana Development: తెలంగాణ పునర్నిర్మాణంలో- పౌర సమాజం మేధావుల పాత్ర

Telangana Development: తెలంగాణ పునర్నిర్మాణంలో- పౌర సమాజం మేధావుల పాత్ర

ఒక కుటుంబం కాదు అందరూ చేయి చేయి కలుపుదాం

నా తెలంగాణ కోటి రతనాల “వీణ” దాశరధి అన్న మాటలను ఒక్కసారి మనం నెమరు వేసుకోవాల్సిన పరిస్థితులు మన ముందున్నాయి. 1969 నుండి 2014 వరకు సుదీర్ఘంగా సాగిన తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియమాకాలు పేరుతో 60 సంవత్సరాలు సకల జనులు ఉద్యమించి సాధించుకున్న తెలంగాణ 2014 నుండి 2024 వరకు ఒక్కసారి పరిశీలిస్తే ఈ గడిచిన పదేళ్ల కాలంలో తెలంగాణ కోటి రత్నాల దిశ నుండి అప్పుల తెలంగాణగా అభివృద్ధి చెందింది. గడిచిన పదేళ్ల కాలంలో తెలంగాణలో ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, విద్య, వైద్య, సామాజిక విలువలు, ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ రంగం, కుటీర పరిశ్రమలు, ఏ మేరకు దెబ్బతిన్నాయో మనం నెమరు వేసుకోవలసిన పరిస్థితులు ఉన్నాయి. డిసెంబర్ 7, 2023 నాడు అధికార బాధ్యతలు చేపట్టిన ప్రజా ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రెండవ ప్రభుత్వం గడిచిన పది సంవత్సరాల కాలంగా తెలంగాణ రాష్ట్రం ఏ మేరకు ఆర్థికంగా వెనుకబడిపోయిందన్న విషయాన్ని గమనించి ప్రజల మౌలిక వసతుల కల్పన, నిరుద్యోగులకు ఉద్యోగాపకాశాల కల్పన, రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా, పేరుకుపోయిన రైతుల బ్యాంకు రుణాలను తీర్చడానికి చేపట్టాల్సిన ప్రణాళికలు, అంతేకాకుండా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి పథంలోనికి నడిపించడానికి పునర్నిర్మాణ కార్యక్రమం చేపట్టిందని చెప్పాలి. ఇందులో ముఖ్యంగా ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన పౌర సమాజం మేధావుల సూచనలు, సలహాలు, రాష్ట్రం పునర్నిర్మాణం కోసం ప్రజా సంఘాలు, వివిధ అంశాలలో విశ్వవిద్యాలయాల లో ఆచార్యులుగా పని చేసిన మేధావులచే చర్చించి తగు నిర్ణయాలు తీసుకొనుటకు ముఖ్యమంత్రి చేపట్టిన కార్యక్రమం ఎంతో ప్రశంసనీయమైంది. ఇందులో ప్రొఫెసర్ హరగోపాల్ తోపాటు చాలామంది మేధావులు ఈ సమావేశంలో పాల్గొని గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏ మేరకు నష్టపోయిందో కుండ బద్దలు కొట్టారు. ఇందులో పాల్గొన్న మేధావులు ప్రధానంగా 2014 నుండి 2024 వరకు అధికారాన్ని నిర్వహించిన గత ప్రభుత్వ హయాంలో పోలీస్ వ్యవస్థ అనుసరించిన నిర్బంధ విధానం, 2005 నుండి 300 వరకు ఉపా కేసులు నమోదు, సమాజంలో పౌర హక్కులు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. పోలీసు వ్యవస్థను రీ ఓరియంటే చేయాలని, పోలీస్ వ్యవస్థను సమీక్షించాలని ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని, అదేవిధంగా విద్యారంగం ప్రపంచీకరణలో పూర్తిగా సంక్షోభంలో ఊరుకు పోయిందన్నారు 2014 నుండి 2024 వరకు రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను పరిశీలిస్తే విశ్వవిద్యాలయాలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న ఒప్పంద, రోజువారి అధ్యాపకులు గత 15 -25 సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ ఉద్యోగ భద్రత లేకపోవడం ప్రాథమిక విద్యను బలోపేతం చేసే దిశలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరి అనుసరించడం డీఎస్సీ ప్రకటించకపోవడం విద్య పూర్తిగా దెబ్బ తిన్నది. విద్యపై పెట్టేది ఖర్చుగా భావించకుండా విద్య వల్ల నైపుణ్యత సాధించడం, విద్యతో సామాజిక అభివృద్ధి పలు అంశాలకు ఎంతగానో దోద పడుతుంది, కానీ ఇటువంటి రంగాన్ని నిర్లక్ష్యం చేయడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ రంగం రైతాంగ సమస్యలు పరిష్కరించడంలో గత ప్రభుత్వం ఏనాడూ మొగ్గు చూపలేదు. కేవలం రైతుబంధు, 24 గంటల కరెంటు తప్ప, ఆర్థికంగా దెబ్బతిన్న రైతును ఆదుకొనుటకు బ్యాంకు రుణాలను మాఫీ చేయడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, అదేవిధంగా పంటలు దెబ్బతిన్నప్పుడు పంట నష్టపరిహారం చెల్లించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించలేదని మేధావులు చెప్పిన మాటలు. ప్రస్తుత ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించడానికి రైతు కమిషన్ ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం ఆహ్వానించదగ్గ విషయం. ఏ విధంగా పట్టణాలు, పల్లెలో మధ్య వ్యత్యాసం ఎక్కువగా కనబడుతుంది ఇటీవల హైదరాబాదులో 55 అంతస్తులు తో నిర్మాణం చేపట్టే విధంగా గత ప్రభుత్వం అనుమతించింది. అయితే దీనివల్ల ట్రాఫిక్ సమస్య, నీటి సమస్య, పర్యావరణ సమస్య తలెత్తే ప్రమాదం ఉందని, ఇది అనాలోచిత చర్యలు అని పలువురు మేధావులు అన్న మాటలు. అంతేకాకుండా భవిష్యత్తు తెలంగాణ( ఒక విజన్ తో) ముందుకు పోవలసిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా సమగ్రమైన ప్రణాళిక రూపొందించి ఇందుకు కావలసిన నిపుణులతో చర్చించి ముఖ్యంగా బ్యూరోక్రసీ, ఎన్జీవోలు పునర్నిర్మాణంలో భాగస్వాములు కావలసి ఉంది. ప్రపంచీకరణ నేపథ్యంలో మాఫియా చాలా బలంగా పనిచేస్తుంది ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు, పత్రికలు అందరూ ఒకే కోణంలో ఉన్నారే తప్ప పూర్తిగా ప్రజల పక్షాన ఉండి కొట్లాడే వ్యవస్థ లేకుండా పోయింది. ప్రజాస్వామ్యం పునరుద్ధరణ తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించాలని ప్రధానంగా పౌర సమాజం సమావేశంలో పలువురు మేధావులు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం పౌర సమాజం సమావేశం లో చర్చించిన అంశాలను, సూచనలు పాటించి ముందుకు పోతే రాష్ట్రం అభివృద్ధి పదంలోనికి ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ఇందుకోసం మనం త్యాగం చేసిన మన తెలంగాణ ఏ విధంగా ఉందో ఒకసారి చరిత్రను పరిశీలించాలి! చరిత్ర వర్తమాన సమాజ అభివృద్ధికి మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది. ప్రస్తుత సమాజానికి దోహదపడే విధంగా రాజకీయ పరిపాలన వ్యవస్థ, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి.
స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి ( జి డి పి) రూపాయలు 9,572,071 మిలియన్లు (2023లో 11 ట్రిలియన్లు లేదా యూఎస్ 140 బిలియన్లకు సమానం ) మరియు తలసరి రూపాయలు 320,000 (యూఎస్ 4,000) తో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ భారతదేశంలో తొమ్మిదవ అతిపెద్దది . . తెలంగాణ మానవాభివృద్ధి సూచిక 0.705 స్కోర్ చేసింది. తెలుగు (75.51%),ఉర్దూ (12.32%),లంబాడీ (5.55%),మరాఠీ (1.77%), హిందీ (1.52%),ఇతరులు (3.33%)
భారతదేశంలోని సాంప్రదాయ భాషలలో తెలుగు ఒకటి తెలంగాణ అధికారిక భాష , ఉర్దూ రాష్ట్ర రెండవ అధికారిక భాష. తెలంగాణ జనాభాలో 75% మంది తెలుగు మాట్లాడతారు ,12% మంది ఉర్దూ మాట్లాడతారు . 1948కి ముందు, ఉర్దూ హైదరాబాదు రాష్ట్ర అధికార భాషగా ఉండేది మరియు తెలుగు-భాషా విద్యాసంస్థల కొరత కారణంగా, ఉర్దూ తెలంగాణ విద్యావంతులైన ఉన్నత వర్గాల భాషగా ఉండేది. 1948 తర్వాత, హైదరాబాద్ రాష్ట్రం కొత్త రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో చేరిన తర్వాత, తెలుగు ప్రభుత్వ భాషగా మారింది , పాఠశాలలు ,కళాశాలల్లో బోధనా మాధ్యమంగా తెలుగు ప్రవేశపెట్టబడినందున , హైదరాబాదీయేతర ముస్లింలలో ఉర్దూ వాడకం తగ్గింది. తెలుగు, ఉర్దూ రెండూ రాష్ట్రవ్యాప్తంగా సేవలలో ఉపయోగించబడుతున్నాయి, తెలంగాణ లెజిస్లేచర్ వెబ్‌సైట్, వెబ్‌సైట్ యొక్క తెలుగు , ఉర్దూ వెర్షన్‌లు అందుబాటులో ఉన్నాయి, అలాగే హైదరాబాద్ మెట్రో, ఇందులో రెండు భాషలను స్టేషన్ పేర్లపై ఉపయోగించారు. మరియు ఇంగ్లీష్ మరియు హిందీతో పాటు సంకేతాలు. తెలంగాణలో మాట్లాడే ఉర్దూను హైదరాబాదీ ఉర్దూ అంటారు , ఇది దక్షిణ భారతదేశంలోని పెద్ద దఖినీ ఉర్దూ మాండలికాల మాండలికం. ఈ భాషను చాలా మంది హైదరాబాదీ ముస్లింలు మాట్లాడుతున్నప్పటికీ, సాహిత్య సందర్భంలో భాష చాలా కాలంగా కోల్పోయింది , ప్రామాణిక ఉర్దూ ఉపయోగించబడుతుంది. హిందీ ప్రధానంగా హైదరాబాద్, అలాగే వరంగల్ వంటి కొన్ని ఇతర పట్టణ ప్రాంతాల్లో మాట్లాడతారు. రాజస్థానీ మాండలికాలకు సంబంధించిన లంబాడీ భాష రాష్ట్రవ్యాప్తంగా వాడుకలో ఉంది. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో మరాఠీ ప్రధానంగా ఉంది, ప్రత్యేకించి పాత ఆదిలాబాద్ జిల్లాలో, కర్ణాటక సరిహద్దులోని కొన్ని ప్రాంతాలలో కన్నడను గణనీయమైన మైనారిటీలు మాట్లాడతారు. పాత ఆదిలాబాద్ జిల్లాలో గోండి ,కొలామి వంటి గిరిజన భాషలు మాట్లాడేవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు , అయితే కోయ భద్రాది కొత్తగూడెం జిల్లాలో , ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో గణనీయమైన సంఖ్యలో మాట్లాడే భాష.
మతం మరియు సంస్కృతితెలంగాణలో మతం (2011) [70],హిందూమతం (85.09%),ఇస్లాం (12.69%), క్రైస్తవ మతం (1.27%),బౌద్ధమతం, (0.09%)సిక్కు మతం (0.09%)జైన మతం (0.08%)
ఇతర (0.01%)పేర్కొనబడలేదు .(0.68%)
2011 జనాభా లెక్కల ప్రకారం, రాష్ట్ర జనాభాలో హిందువులు 85.1% ఉన్నారు. ముస్లింలు 12.7% మరియు క్రైస్తవులు 1.3% ఉన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని లక్ష్మీ నరసింహ దేవాలయం , హైదరాబాద్‌లోని మక్కా మసీదు , వరంగల్‌లోని పురాతన భద్రకాళి ఆలయం , గోవింద రాజుల గుట్ట , జోగులాంబ గద్వాల్ జిల్లాలోని అలంపూర్ జోగులాంబ ఆలయం మరియు మెదక్ కేథడ్రల్ , కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం , కోద్రతా స్వామి దేవాలయం వంటి మతపరమైన కట్టడాలు . రాజన్న-సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలోని శివాలయం అనేక ప్రసిద్ధ ప్రార్థనా స్థలాలు. బౌద్ధమతం కూడా ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందింది మరియు అనేక ఆరామాలు చూడవచ్చు.
తెలంగాణకు చెందిన హైదరాబాదీ వంటకాలు మరియు కాకతీయ ఆర్కిటెక్చర్ రెండూ యునెస్కో క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీ ,యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ యొక్క సృజనాత్మకత జాబితాలో ఉన్నాయి .తెలంగాణ, హైదరాబాద్ , వరంగల్ యొక్క సాంస్కృతిక కేంద్రాలు, వాటి సంపద , ప్రసిద్ధ చారిత్రక నిర్మాణాలకు ప్రసిద్ధి చెందాయి – రామప్ప ఆలయం ( యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ), చార్మినార్ , కుతుబ్ షాహీ సమాధులు , ఫలక్‌నుమా ప్యాలెస్ , చౌమహల్లా ప్యాలెస్ , వరంగల్ కోట , కాకతీయ కళా తోరణం , వెయ్యి. ఆలయం ,భోంగీర్ కోట ,
2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ అక్షరాస్యత రేటు 66.46%. పురుషుల అక్షరాస్యత , స్త్రీల అక్షరాస్యత వరుసగా 74.95% మరియు 57.92%. హైదరాబాద్ జిల్లా అత్యధిక అక్షరాస్యత రేటును 80.96% , మహబూబ్ నగర్ జిల్లా అత్యల్పంగా 56.06% కలిగి ఉంది.2019 నివేదికలో, భారతదేశంలో విద్యపై గృహ సామాజిక వినియోగం యొక్క ముఖ్య సూచికలు , గణాంకాలు , ప్రోగ్రామ్ అమలు మంత్రిత్వ శాఖ, తెలంగాణ 72.8% అక్షరాస్యత రేటును కలిగి ఉంది, ఇది పెద్ద రాష్ట్రాల్లో నాల్గవ అత్యల్పంగా ఉంది. ఇది గ్రామీణ మహిళల్లో 53.7%తో రెండవ అత్యల్ప అక్షరాస్యత రేటును కలిగి ఉంది. తెలంగాణలో 3-35 సంవత్సరాల వయస్సు గల జనాభాలో 37.1% మంది ప్రీ-ప్రైమరీ ఉన్నత స్థాయిలలో ఉచిత విద్యను పొందారు. ఇంత సుదీర్ఘ చరిత్ర కలిగిన తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవలసిన పరిస్థితులు మన ముందు ఉన్నాయి.

- Advertisement -

డాక్టర్. రక్కిరెడ్డి ఆదిరెడ్డి
కాకతీయ విశ్వవిద్యాలయం

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News