ఎన్నికల వేళ సరికొత్త వివాదానికి తెర లేచింది. అయిదేళ్లుగా అచేతనంగా పడి ఉన్న పౌరసత్వ సవరణ చట్టం (2019) ప్రస్తుతం మళ్లీ అమలులోకి వచ్చింది. దీని వెనుక ఎన్నికల ఉద్దేశాలున్నట్టు ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడం సహజమే కానీ, దేశానికి ఈ చట్టం అవస రమనడంలో ఏమాత్రం సందేహం లేదు. భారతదేశ సరిహద్దు దేశాలైన పాకిస్థాన్, అఫ్ఘాని స్థాన్, బంగ్లాదేశ్ వంటి ముస్లిం దేశాల నుంచి పారిపోయి భారతదేశంలో తలదాచుకుంటున్న భారతీయులకు పౌర సత్వం కల్పించడానికి ఉద్దేశించిన చట్టం ఇది. 2015కు ముందు భారతదేశానికి వచ్చిన హిందువులు, పార్శీలు, జైనులు, బౌద్ధులు, సిక్కులు, క్రైస్తవులకు ఈ చట్టం కింద పౌరసత్వం కల్పించడం జరుగుతుంది. లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇంకా కొద్ది రోజుల్లో వెలువడనుందనగా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టానికి సంబం ధించిన విధి విధానాలను విడుదల చేయడం జరిగింది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగిందని, ఈ రాష్ట్రంలోనే ముస్లింలు అత్యధిక సంఖ్యలో ఉన్నారని, పైగా బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి తృణమూల కాంగ్రెస్ అయినందువల్ల కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రతి విషయం లోనూ ఈ రాష్ట్రాన్ని లక్ష్యంగా చేసుకోవడం జరుగుతోందని ప్రతిపక్షాలు విమర్శలు సాగిస్తున్నాయి. నాలుగేళ్లు చడీ చప్పుడూ లేకుండా ఉండి, ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఈ చట్టాన్ని అమలులోకి తీసుకు రావడంలో ప్రభుత్వ ఉద్దేశమే మిటన్నది ఇదమిత్థంగా తెలి యడం లేదు. ప్రభుత్వం కూడా ఇందుకు సరైన సమా ధానం ఇవ్వడం లేదు. నిజానికి, ఈ చట్టం మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంటూ వస్తోంది. దీన్ని రాజ్యాంగవిరుద్ధమైన, వివక్షాపూరిత, పక్షపాత చట్టంగా ప్రతిపక్షాలు పరిగణిస్తూ వస్తున్నాయి. 2019లో ఈ చట్టాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించినప్పుడు ఢిల్లీ, అసోం రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. హింసా విధ్వంసకాండలు కూడా చెలరేగాయి కానీ, కోవిడ్ మహమ్మారి విజృంభిం చడంతో ఇవన్నీ ఎక్కడివక్కడ ఆగిపోయాయి.
అసోంలో ఈ నిరసన ప్రదర్శనలు, హింసా విధ్వంసకాండలు మరీ ఉధృతంగా చెల రేగాయి. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన లక్షలాది మందికి పౌరసత్వం కట్టబెడతారనే అపోహతో ఇక్కడ మరీ ఎక్కువగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ చట్టాన్ని సుప్రీం కోర్టులో సవాలు చేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఇంకా తీర్పు ఇవ్వకుండానే ప్రభుత్వం ఈ చట్టానికి సంబంధించిన విధి విధానాలను, నియమ నిబంధనలను విడుదల చేయడం, అమలు చేస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ నియమ నిబంధనలను కూడా న్యాయస్థానం లో సవాలు చేసే అవకాశం ఉంది. గత ఎన్నికల సమయంలో ప్రచారం సందర్భంగా తాము ఈ చట్టం విషయంలో దేశ ప్రజలకు వాగ్దానం చేశామని, తామిప్పుడు దాన్ని కూడా నెర వేరుస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ప్రతిపక్షాలు మాత్రం దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. దేశంలో మత భావాలు రెచ్చగొట్టడానికి కేంద్ర ప్రభుత్వం మరో ఎత్తుగడ తో ముందుకు వచ్చిందంటూ అవి విమర్శలు సాగిస్తున్నాయి.
ఈ ముస్లిం దేశాల నుంచి వేలాది మంది భారతీయ ముస్లింలు కూడా భారతదేశానికి వలస వచ్చారని, అయితే వారికి ఈ చట్టంలో స్థానం కల్పించలేదని, ముస్లింల పట్ల పక్ష పాతంతోనే ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకు వచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తు న్నాయి. ఈ చట్టాన్ని అమలు పరచిన తర్వాత జాతీయ పౌరసత్వ నమోదు చట్టాన్ని కూడా ప్రభుత్వం అమలులోకి తీసుకు వచ్చి, ముస్లింలను పక్కనపెట్టడం ప్రారంభిస్తుందని ప్రతిపక్షాలు ఆం దోళన వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆ జాతీయ పౌర సత్వ నమోదు చట్టాన్ని అమల్లోకి తీసుకు వస్తుందో లేదో తెలియదు కానీ, ముస్లిం దేశాల్లో అణచివేతలకు, అన్యాయాలకు, అక్రమాలకు గురైన భారతదేశానికి వలస వచ్చిన వారిలో ముస్లింలు లేకపోవడం మాత్రం వివక్షాపూరిత మని ముస్లిం వర్గాలు కూడా భావిస్తున్నాయి. మత ప్రాతిపదికన పౌరసత్వం కల్పించడం ప్రజాస్వామ్య దేశంలో, అందులోనూ లౌకికవాద దేశంలో సమంజసం కాదని ప్రతిపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. రాజ్యాంగంలో పౌరసత్వానికి సంబంధించి పేర్కొన్న నిబంధనలకు ఇది పూర్తిగా విరుద్ధమని కూడా అవి అభిప్రాయపడు తున్నాయి. ఎన్నికల సమయంలో అమలు చేస్తున్న ఈ చట్టాన్ని ఎన్నికల తర్వాత మరింత ఉధృతంగా అమలు చేసే అవకాశం ఉంది.
CAA controversy: ఎన్నికల వేళ సీ.ఎ.ఎ వివాదం
సీఏఏపై ఒక్కొక్కరిది ఒక్కో వైఖరి