మాదక ద్రవ్యాల నిర్మూలనపై “యాంటీ డ్రగ్స్ క్లబ్” అధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ జిల్లా స్థాయి చిత్రలేఖనం (పెయిటింగ్) పోటీలను నిర్వహించారు. జిల్లాలోని అన్ని పాఠశాలలోని విద్యార్థులను 3 కేటగిరీలుగా విభజించారు. ప్రాథమిక స్థాయి,హై స్కూల్ స్థాయి, కాలేజీ లెవెల్ అనే మూడు విభాగాలుగా విభజించి, పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో మండల స్థాయిలో ఇల్లంతకుంట మండలంలోని శ్రీవాణి ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు మెదటి కేటగిరీలోని ప్రాథమిక స్థాయిలో ప్రథమ ,ద్వితీయ బహుమతులు గెలుపొందారు. రెండవ కేటగిరీలలో హైస్కూల్ స్థాయిలో ఇద్దరు విద్యార్థులు ప్రథమ బహుమతి వాణీనికేతన్ ఇంగ్లిష్ మీడియమ్ స్కూల్, ద్వితీయ బహుమతి జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్, మూడవ కేటగిరీలో కాలేజీ స్థాయిలో ప్రథమ, ద్వితీయ బహుమతి గెలుపొందారు. గెలుపొందిన విద్యార్థులకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రశంసా పత్రాలను బహుమతిగా అందజేశారు.
ఈ సందర్బంగా ఎస్సై రాజు గౌడ్, ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ రాజేశ్వర్ రావు, ప్రధానోపాధ్యాయులు ప్రేమలత, ఆయా విద్యాసంస్థల యాజమాన్యం గనగోని శ్రీకాంత్, సురేష్, ప్రిన్సిపల్ కోయడ సత్యనారాయణ, కరస్పాండెంట్ తూముకుంట్ల శ్రీనివాస్ రెడ్డి,ప్రిన్సిపల్ శ్రీనిధి, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులును అభినందించారు.