Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: సి-విజిల్ ఫిర్యాదులు వంద శాతం పరిష్కరించాలి

Kurnool: సి-విజిల్ ఫిర్యాదులు వంద శాతం పరిష్కరించాలి

ప్రతి రోజూ, ప్రతి కేసు ఫాలో అప్ చేయాల్సిందే

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని, సి విజిల్ ఫిర్యాదులను వంద శాతం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన అధికారులను ఆదేశించారు. ఆర్ ఓ లు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ వచ్చి మూడు, నాలుగు రోజులు గడిచినప్పటికీ ఎన్నికల ప్రవర్తన నియమావళికి సంబంధించి ఇంకా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయన్నారు. పబ్లిక్ ప్రాపర్టీస్, ప్రైవేట్ ప్రాపర్టీస్ మీద పోస్టర్స్, హోర్డింగ్స్, బ్యానర్స్ తదితరాలను ఈపాటికే తీసేసి ఉండాల్సిందన్నారు. ఇంకా ఇప్పటికి తీసేయకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.. ఈ అంశంపై ఈ రోజు మధ్యాహ్నం లోపు చీఫ్ సెక్రటరీకి సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉందని, ఆ తర్వాత ఇలాంటి ఫిర్యాదులు రాకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. రిటర్నింగ్ అధికారులు ఎంపీసీ టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ పైన కంట్రోల్ తెచ్చుకోవాలన్నారు..ప్రతి రోజూ, ప్రతి కేసు పైన ఫాలో అప్ చేయాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించిన వారికి నోటీసులు ఇవ్వడంతో పాటు క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేస్తామని రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలియచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆర్వోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు ఎంసిసి తో పాటు సి విజిల్ ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.. సి విజిల్ కి ఫిర్యాదుల పరిష్కారంలో పాణ్యం, పత్తికొండ నియోజకవర్గాలు వెనుకబడి ఉన్నాయని, 33% మాత్రమే చేశారన్నారు.. వంద నిమిషాల్లో పరిష్కరించాల్సి ఉండగా రెండు గంటలు దాటుతోందని కలెక్టర్ గుర్తు చేశారు..జిల్లా మొత్తం 71 శాతం మాత్రమే పరిష్కారం ఉందని, సివిజిల్ ఫిర్యాదులను వంద శాతం 100 నిమిషాల్లో పరిష్కరించాలన్నారు. రాను రాను ఫిర్యాదులు పెరిగే అవకాశం ఉందని, కాబట్టి ఈ అంశంలో చురుగ్గా ఉండాలన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లను తొలగించడంతో పాటు క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. స్వీప్ కార్యక్రమాలు కనిపించట్లేదని, వీటిని ముమ్మరం చేయాలని, ఓటు నమోదుపై ర్యాలీలు, ఇంటర్వ్యూలు, ఇతర అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని కలెక్టర్ ఆర్వోలను ఆదేశించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు వాహనాలు తీసుకోవాలని, వాహనాలు లేని కారణంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో వెనుక పడ్డామంటే కుదరదని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు.

- Advertisement -

టెలికాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, మునిసిపల్ కమిషనర్ భార్గవ్ తేజ, ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, కర్నూలు ఆర్డీఓ శేషి రెడ్డి, పత్తికొండ ఆర్డీఓ రామలక్ష్మి, జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News