జగన్ పేరు చెప్పడం మాని, మీ పేరు చెప్పి ఓట్లు అడిగే దమ్ముందా అంటూ రాఘవేంద్ర రెడ్డి వైసీపీ నేతకు సవాల్ విసిరారు. ఒక్కరోజు వేసే ఓటు మనల్ని ఐదు సంవత్సరాలు కాపాడుతుందన్నారు రాఘవేంద్ర రెడ్డి. ఒక ఓటు ఎమ్మెల్యేకు, మరో ఓటు ఎంపీకు వేసి, వేయించి టీడీపీ పార్టీని గెలిపించుకుందామన్నారు. కోవర్టు అని నిరూపిస్తే రాజకీయా సన్యాసం తీస్కుంటామని ఆయన అనడం విశేషం.
బీసీ కులస్తులు అభివృద్ధి చెందాలంటే టిడిపి ప్రభుత్వం తోనే సాధ్యమని మంత్రాలయం కూటమి అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి అన్నారు. స్థానిక దుద్ధి గ్రామానికి వెళ్లే రోడ్డులో నాలుగు మండలాల నాయకులు , కార్యకర్తలతో పరిచయ సభ ఏర్పాటు చేశారు. చింతలగేని, నర్సిరెడ్డిల అధ్యక్షతన , చూడి ఉలిగయ్య , ముత్తు రెడ్డి , పల్లెపాడు. రామిరెడ్డి ,తోవి రామకృష్ణ ,ఎన్. రామకృష్ణ రెడ్డి , సురేష్ నాయుడుల ఆధ్వర్యంలో సభ నిర్వహించారు.
రాఘవేంద్ర రెడ్డిని అసెంబ్లీకు తప్పకుండా పంపుతామన్నారు. రాఘవేంద్రతో పాటు మనందరం కూడా అభ్యర్థులమేననంటూ వీరంతా ప్రచార పర్వంలో దూసుకోపుతున్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు ఎన్. రాకేష్ రెడ్డి , సొట్టయ్య, షోరూం వీరేష్ , వాల్మీకి మధు, జనసేన మధు, హనుమేష్, సిద్ధాప్పన్న, ఎరిగేరి రామలింగ ఆయా గ్రామ నాయకులు , కార్యకర్తలు , జనసేన నాయకులు పాల్గొన్నారు.