” వృక్షాన్ని నువ్వు రక్షిస్తే.. అది నిన్ను రక్షిస్తుంది” ఎందుకంటే చెట్లు లేదా అడవులు స్వచ్ఛమైన గాలిని ఇస్తాయి దాని ద్వారా మనము ఆరోగ్యంగా ఉండగలం, అంతేకాకుండా అడవులు పర్యావరణ పరిరక్షణ చేస్తుంటాయి, ఎన్నో అటవీ జాతులకు ఆశ్రయాన్ని కల్పిస్తూ పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా, ఆహారపు గొలుసు దెబ్బ,తినకుండా అడవులు తోడ్పడుతున్నాయి. ఎన్నో ఔషధ మొక్కలకు నిలయాలుగా కూడా ఇవి ఉంటున్నాయి. ఒకవేళ అడవులు ఇదేవిధంగా విధ్వంసం జరిగితే ఎన్నో జీవజాతుల్ని మనము కోల్పోవాల్సి వస్తుంది. మనం ఒకప్పుడు కోతుల్ని సర్కస్లో మాత్రమే చూసే వారం ఎందుకు అవి అడవుల్లో నివసించేవి ప్రస్తుతం స్వ ప్రయోజనాల కోసం అడవులను నాశనం చేయడం వల్ల కోతులను మనము ఇళ్లలో చూసుకోవాల్సి వస్తుంది. గత పాలకులు హరితహారం పేరుతో ఆర్భాటం చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం, లూటీ చేశారు ఇది జగమెరిగిన సత్యం. నాటిన వాటిని సంరక్షించడం కూడా చేయలేకపోయారు. వన్యప్రాణుల కు ఉపయోగపడే పండ్ల చెట్లను కూడా పెంచలేక పోయారు చాలా బాధాకరం.
పోడు సాగు విషయంకి వస్తే ఏ రాజకీయ పార్టీ అయినా తమ లబ్దికోసం పొడు పట్టాలు ఇవ్వటం అనవాయతిగా జరుగుతుంది. దీనివల్ల అడవులు అంతరించే ప్రమాదం ఉంది. ఇది ప్రభుత్వ పాలసీ దీన్ని మనం తప్పు పట్టడం లేదు. కానీ పాలకులు చేయవలసిన పని ఏమిటంటే పోడు పట్టాలు ఇచ్చిన వ్యక్తులను ఆ అటవీ భూములలో కమర్షియల్ క్రాప్స్ (పత్తి, మిర్చి) కాకుండా బహువార్సిక మొక్కలు ఉదా ..మామిడి, నిమ్మ, కొబ్బరి, ఆయిల్పామ్ ఇంకా వేరేవైనా నాటడం వల్ల అటవీ పరిమాణం కూడా వృద్ధి చెందుతుంది పోడు పట్టాదారుల కు ఆదాయం సమకూరుతుంది. పర్యావరణం మెరుగవుతుంది. , ప్రభుత్వాల లక్ష్యాలు కూడా నెరవేరుతాయి. పోడు పట్టాదారుడి కి ప్రభుత్వం భూమి ఇస్తుంది అతను ఏపుగా ఎదిగే చెట్లను పెంచడం ద్వారా ఆదాయం వస్తుంది. అడవి వృద్ధి చెందుతుంది.
ప్రభుత్వాలు ఈ దిశగా ఆలోచించాలి..
చివరిగా ప్రతి ఒక్కరూ అడవుల్ని పెంచటం అంటే వాటిని రక్షించటం ఎవరైనా విధ్వంసకారులు ఉంటే వారి సమాచారం సంబంధిత డిపార్ట్మెంట్ కు చేరవేయడం, పుట్టినరోజు మరియు వివాహ మహోత్సవాల సందర్భంగా మొక్కల నాటడం, మొక్కలను బహుమతిగా ఇవ్వడం ద్వారా మనం ఎంతోకొంత అడవులు కు పర్యావరణానికి మేలు చేసిన వారం అవుతాం. అడవులు నాశనం అయితే వర్షాలు ఉండవు, భూగర్భ జలం ఇంకిపోతుంది.
కాబట్టి తస్మాత్ జాగ్రత్త..
భద్రాద్రి జిల్లా రాష్ట్రంలోనే అత్యధిక అటవీ విస్తీర్ణం గల జిల్లా దానిని మనం కాపాడాలి. కాబట్టి సమాజంలోని ప్రతి ఒక్కరూ అడవులను కాపాడుకునే ఆలోచన చేద్దాం…అమలు చేద్దాం…