ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల్లోనూ యంగ్ లీడర్స్ హవా జోరుగా సాగుతోంది. తమ పెద్దల విజయం కోసం వారి పిల్లలు ఎన్నికల ప్రచారంలో అన్నీ తామై నడిపిస్తున్నారు. ఓవైపు సోషల్ మీడియా ప్లాట్ ఫాంలపై మరోవైపు స్వయంగా ఓటర్లను కలుసుకుంటూ, ప్రజా క్షేత్రంలో తమ సత్తా చాటుతున్నారు. కర్నూలు జిల్లాలో పలువు రాజకీయ కుటుంబాల వారసులంతా ఇప్పుడు ఇక్కడి పల్లెల్లో కలియతిరుగుతుండటం రొటీన్ గా మారింది.
తాజాగా కోట్ల చిత్రమ్మ గురించి స్థానికులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. బాగా చదువుకున్న ఇలాంటి యువత రాజకీయాల్లోకి రావాలని ఓటర్లు ఉత్సాహం చూపుతుండటం హైలైట్. టిడిపి యువ నాయకురాలు కోట్ల చిత్రమ్మ బేతంచెర్ల పట్టణంలో టీడీపీని గెలిపించాలని బేతంచర్ల ప్రజలను కలుసుకొని మాట్లాడారు.
బేతంచెర్ల నగర పంచాయతీ 7,15,16 కౌన్సిల్ లో బాబు షూరిటీ – భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం స్థానిక టిడిపి నాయకులు కాకర్ల తిరుమలేశ్ చౌదరి, మేకల నాగరాజు, రూబెన్, ఫయాజ్ ఆధ్వర్యంలో టిడిపి పట్టణ అధ్యక్షురాలు బుగ్గన ప్రసన్నలక్ష్మి , అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో కోట్ల చిత్రమ్మ
ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరించారు.
ఈ సందర్బంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న టిడిపి యువ నాయకురాలు కోట్ల చిత్రమ్మ మాట్లాడుతూ, జగన్ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని, జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో వైసిపి రౌడీ మూకలు మహిళలపై నిత్యం దాడులు చేస్తూ, నడిరోడ్లో మహిళలను చీర లాగితే, సైకో జగన్ ఖండించకపోగా, పైసాచిక ఆనందం పొందుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలలో ” మహాశక్తి పథకం ” ద్వారా మహిళలు మహారాణులు కావడం ఖాయం అన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన సైనికులు చల్ల మద్దిలేటి స్వామి, నాగరాజు, శ్రీ కంటి మధు తెలుగుదేశం పార్టీ నాయకులు రవీంద్ర నాయక్ రామనాధం,వార్డు కౌన్సిలర్ అంజి,గూటంశివ, ఆర్ శివ, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.