మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ టికెట్ పునారాలోచన చేసి పాలకుర్తి తిక్కారెడ్డికి ఇవ్వాలని వైసిపి కోవర్ట్ అయిన మాధవరం రాఘవేంద్ర రెడ్డి కి టికెట్ ఇస్తే మేము పని చేయమని దళితులు పేర్కొన్నారు. మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బాధ్యులు పాలకుర్తి తిక్కారెడ్డి కే ఇవ్వాలని మేము అందరూ కలిసి గెలిపిస్తామని మీకు బహుమతిగా ఇస్తామని మంత్రాలయం నియోజకవర్గం యస్ సి సెల్ నియోజకవర్గం అధ్యక్షులు ఏరిగేరి వీరేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీర్మానం చేసి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపారు.
ఈ కార్యక్రమంలో యస్ సి సెల్ నాయకులు విజయ్ కుమార్, యోబు, రాజాబాబు, సల్మాన్ రాజు, సురేంద్ర, దేవన్న, రాజు, రామయ్య, జనసేన ఏసేపు మాట్లాడుతూ… రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బాధ్యులు పాలకుర్తి తిక్కారెడ్డి గారు కి పునరాలోచన చేసి టికెట్ ఇవ్వాలని లేని పక్షంలో మేం మొత్తం రాజినామా చేస్తామని హెచ్చరించారు. మంత్రాలయం నియోజకవర్గం లో తెలుగుదేశం జెండా ఎగరాలంటే ప్రజలు మనిషి కార్యకర్తలకు అండగా నిలిచిన వ్యక్తి పాలకుర్తి తిక్కారెడ్డి కే తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ప్రకటించిన వ్యక్తి వైసిపి కోవర్ట్ అన్నారు. అయిన మాధవరం రాఘవేంద్ర రెడ్డి కి వద్దు మేం పనిచేయమని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బాధ్యులు పాలకుర్తి తిక్కారెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో మీ అందరి ఆశీస్సులతో కచ్చితంగా అసెంబ్లీకి పోటీ చేస్తాను అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పునరాలోచన చేసి నాకు టికెట్ ఇస్తారని నాకు నమ్మకం ఉంది అని లేకపోతే మీ అందరి కోరిక మేరకు నేను కచ్చితంగా అసెంబ్లీకి పోటీ చేస్తాను అని నేను వెనుకడుగు వేయను అని మీకందరికీ నేను కచ్చితంగా అండగా ఉంటానని పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు మీకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అని నాకు అండగా నిలిచిన మీకు నేను కచ్చితంగా అండగా ఉంటాం అని పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి, అశోక్ రెడ్డి, యువనాయకులు మాధవరం కృష్ణమోహన్ రెడ్డి, తెలుగు యువత జిల్లా మీడియా కోఆర్డినేటర్ విజయ రామిరెడ్డి, యస్ సి సెల్ నాయకులు సుజ్ఞాన్నాం, ఇస్రాయేలు, కలుకుంట అబ్రహం, మంత్రాలయం శివ, నరసింహులు, వందగల్ డీలర్ లింగమూర్తి, బసవలింగప్ప, నాగేష్, యోహాను, దేవదాస్, చిదానంద, నాగన్న, ప్రకాష్,జయన్న, మురవణి యోహాను, లాజర్, చిన్నతుంభళం ఈరన్న, దిద్ది మల్లేష్, సాతునూరు రాజు, కౌతాళం గాబ్రియేల్, శ్రీనివాస్, రాజు,రేవన్న, మారేష్,శాంతిరాజు,అన్ని గ్రామాలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు