భారత్, అమెరికా సహా ఈ ప్రపంచం మొత్తంలో సగం జనాభా గల 50 కంటే ఎక్కువ దేశాలలో 2024లో ఎన్నికలు జరుగబోతుండడం విశేషం. భారత ఎన్నికల కమిషన్ సమాచారం ప్రకారం 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి అర్హులైన నమోదిత ఓటర్ల సంఖ్య 89.6 కోట్లు కాగా, జనవరి 1, 2024 నాటికి ఆ సంఖ్య 96.88 కోట్లకు చేరుకుంది. మార్చ్ 10, 2024 నాటికి మొత్తం నమోదిత ఓటర్లలో 81,87,999 మంది 85 సంవత్సరాలు పైబడిన వయోజనులు కాగా 2,18,442 మంది 100 సంవత్స రాలు పైబడిన వృద్ధులు కావడం విశేషం. 17వ లోక్‌సభ కు 2019లో జరిగిన ఎన్నికలలో యువతరం, విద్యావం తులు మరియు మహిళా ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొన డంతో పాటు పోటీ చేయడం కూడా విశేషం. తత్ఫలితంగా ఈ సారి లోక్ సభలో మహిళా పార్లమెంటేరియన్ల సంఖ్యా బలం 15 శాతానికి పెరిగింది. ఈ ఎన్నికలలో మొత్తం 543 స్థానాలకు గాను దాదాపు 8 వేల మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ 303 (మిత్రపక్షాలతో కలిపి 351) స్థానాలు గెలుచుకుంది. భారత దేశ చరిత్రలో అత్యధికంగా ఈ సార్వత్రిక ఎన్నికలలో 67.4 శాతం (దాదాపు 61.5 కోట్ల మంది) ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కోవడమే కాక మొట్టమొదటిసారిగా, స్త్రీ-పురుష ఓటర్ల నిష్పత్తి దాదాపు సమానమయ్యింది.
హాజరు శాతంలో వృద్ధి
17వ లోక్‌సభ (జూన్ 2019 – మే 2024)ను, భారతదేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్య మైన మైలురాయిగా పెర్కొనవచ్చు. 17వ లోక్‌సభ, గతం తో పోల్చితే అతి తక్కువ సంఖ్యలో 274 సార్లు సమావేశ మైనప్పటికీ సభ్యుల హాజరు, ప్రశ్నోత్తరాల సమయం మరియు శాసనసభ కార్యకలాపాల పరంగా చెప్పుకోదగ్గ పరిణతి సాధించింది. ప్రత్యేకించి ఈ లోక్‌సభలో సగానికి పైగా సభ్యుల వయస్సు 60 ఏళ్ల కంటే తక్కువ కావడంతో పాటు మొత్తం సభ్యుల సంఖ్యలో 15 శాతం మంది మహి ళా ప్రతినిథులు కావడం మహిళా సాధికారత కోణంలో హర్షించదగ్గ పరిణామం. కోవి్‌డ19 మహమ్మారి వంటి సవాళ్లు ఉన్నప్పటికీ, 17వ లోక్‌సభలో సభ్యుల హాజరు 79 శాతానికి చేరుకోవడం సంతోషదాయకమైన విషయం. ప్రత్యేకించి 2019 మరియు 2023 సమావేశాలలో సభ్యు లు అంకిత భావాన్ని ప్రదర్శిస్తూ అత్యధిక సంఖ్యలో హాజ రు కావడం గమనార్హం. మొత్తం సభ్యులలో 277 మంది మొదటి సారి లోక్ సభకు ఎన్నికైన ప్రజా ప్రతినిథులు కావడం మరో విశేషం. మహారాష్ట్ర నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీలు సగటున ప్రతి ఒక్కరు దాదాపు 370 ప్రశ్నలు సంధించగా, 60 ఏళ్లలోపు ప్రజా ప్రతినిథులు, సీనియర్ సభ్యుల కంటే ఎక్కువ ప్రశ్నలు సంధించి తమ ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుకున్నారు.
అత్యంత ఖరీదైన ఎన్నికలు
భారత్‌లో జరిగే 2024 సార్వత్రిక ఎన్నికలను ప్రజాస్వామ్య చరిత్రలో నిర్వహింపబడుతున్న అతి పెద్దవి గా అభివర్ణించవచ్చు. ఈ ఎన్నికలు అమెరికాను మించి పోవడమే కాదు, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవి. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో 90 కోట్ల అర్హులైన ఓటర్లను ఆకర్షించడానికి వివిధ రాజకీయ పార్టీలు మరియు అభ్యర్థులు 8.7 బిలియన్ల అమెరికా డాలర్లను వెచ్చించారంటే ఆశ్చర్యం కలుగక మానదు. ఈ ఎన్నికలలో 673 పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తూ 8,054 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎన్నికల నియమావళి అమ లులో ఉన్న సమయంలో ఓటర్లను ప్రభావితం చేయడానికి అక్రమంగా తరలిస్తున్న దాదాపు రు.3100 కోట్ల విలువ గల మద్యం, నగదు, బంగారం, మత్తు పదార్థాలు వగైరా లను ఎన్నికల సంఘం జప్తు చేయడం విస్మయం కలిగిస్తుంది.
నిమిషానికి రెండున్నర లక్షల ఖర్చు
ఉభయ సభలను నడపడానికి తీసుకునే పన్ను చెల్లిం పుదారుల డబ్బు కంటే పార్లమెంట్‌లో అంతరాయాలకు ఎక్కువ ఖర్చవుతుంది. మార్చి 2023లో లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్, పి డి టి ఆచారి, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్‌తో మాట్లాడుతూ, పార్లమెంటు కార్యకలాపాలు నిర్వహించ డానికి భవనం యొక్క నిర్వహణ, విద్యుత్, నీరు, పెట్రోల్, ఆహారం, పార్లమెంటు భద్రత, ఎంపీలు, వారి అంగరక్ష కులు, పార్లమెంట్ సిబ్బంది మరియు ఉద్యోగులందరి జీతభత్యాలు వంటి ఇతర నిర్వహణ ప్రత్యక్ష, పరోక్ష ఖర్చుల నిమిత్తం నిమిషానికి దాదాపు రూ.2.5 లక్షలు ఖర్చవుతుందని వివరించారు. ప్రజల నుండి పన్నుల రూపంలో సేకరించిన ప్రజా ధనం దుర్వినియోగానికి ఉదాహరణగా 2021లో వర్షాకాల సమావేశాల సంద ర్భంగా నిర్ధారిత 107 గంటలలో కేవలం 18 గంటలు పార్లమెంటు కార్యకలాపాలు కొనసాగాయి. ఫలితంగా పన్ను చెల్లింపుదారుల విలువైన రూ.133 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సాధార ణంగా పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ప్రతి రోజు, ఉభయ సభలలో దాదాపు ఆరు గంటల పాటు కార్యకలా పాలు నిర్వహించబడతాయి. 1978కి ముందు రెండు సభల ఉత్పాదకత 100 శాతం మార్కును దాటింది. ప్రాం తీయ పార్టీలు మరియు గ్రామీణ రాజకీయాల పెరుగుద లతో, పార్లమెంటులో చర్చ గణనీయంగా పెరిగి, కొన్ని సార్లు నిరసనకు దారితీస్తుందని చాలా మంది పార్లమెంటు సభ్యులు భావిస్తున్నారు. ఉత్పాదకత రేటు తగ్గడానికి ప్రధాన కారణం నినాదాలు మరియు నిరసనల కారణంగా సమావేశాలలో అంతరాయం ఏర్పడిందని భావిస్తున్నారు. 2017-18లో పార్లమెంటు శీతాకాల సమావేశాలకు అంతరాయం కలగడంతో ప్రభుత్వ ఖజానాకు 140 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. దీంతో పార్లమెంటు పని తీరుపై పన్ను చెల్లింపుదారులలో తీవ్ర అసంతృప్తి చెలరే గింది. 2019 బడ్జెట్ సమావేశాలలో, లోక్‌సభ ఉత్పాదకత 137 శాతానికి మరియు రాజ్యసభ 103 శాతానికి చేరు కుంది. లోక్‌సభ 480 గంటలపాటు అద్భుతంగా పని చేసింది మరియు 37 సెషన్‌లలో, వాయిదాలు మరియు అంతరాయాల కారణంగా సమయం కోల్పోలేదు. దీనిని ఆహ్వానిస్తూ, పన్ను చెల్లింపుదారులు అధికార మరియు ప్రతిపక్ష పార్టీల ప్రయత్నాలను ప్రశంసించారు.
పాలనా విధానాలు
2023 నాటికి ప్రపంచంలో పూర్తి ప్రజాస్వామ్యం 24 (14.40 శాతం), లోపభూయిష్ట ప్రజాస్వామ్యాలు 50 (29.90 శాతం), హైబ్రిడ్ పాలనలు 34 (24.40 శాతం) మరియు అధికార పాలనలు 59 (35.30 శాతం) విధానాన్ని అవలంభిస్తున్నాయి. 2023 ఫిబ్రవరిలో స్టాటి స్టా సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం 10 పాయింట్ల ఆధారంగా నిర్వహించిన సర్వేలో నార్వే 9.8, న్యూజి ల్యాండ్ 9.61, ఐస్ ల్యాండ్ 9.52, స్వీడన్ 9.39, ఫినా ల్యాండ్ 9.29, డెన్మార్క్ 9.28, స్విట్జరాల్యాండ్ 9.14, ఐరాల్యాండ్ 9.13, నెదర్ల్యాండ్స్ 9.0, తైవాన్ 8.99 పాయింట్లు దక్కించుకుని ప్రపంచంలోని పది అత్యంత ప్రజాస్వామిక దేశాల సూచీలో నిలువగా 140 కోట్ల పై చిలుకు జనాభాతో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న మన దేశం 6.9 పాయింట్లతో నలభై ఆరవ స్థానంలో ఉంది.
స్వామీ వివేకానంద స్ఫూర్తి
లేవండి.. మేల్కోండి… గమ్యం చేరేవరకూ ఆగకండి.. బలమే జీవితం, బలహీనతే మరణం. ఎప్పడూ జాగృతం గానే ఉండండి. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం మనసులో ఉన్న యువత ఈ దేశానికి ఆవశ్యకం అని ప్రవచించిన స్వామీ వివేకానందుడి మాటలను స్ఫూర్తిగా తీసుకుని దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న 30 సంవత్సరాల లోపు యువత దేశాభివృద్ధి కోసం నైరాశ్యం వీడి, నడుం బిగించి తాము చైతన్యవంతులై ప్రత్యక్ష రాజ కీయాలలోకి వచ్చి చట్ట సభలలో అర్థవంతమైన చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగేల చూసి ప్రజలకు పార దర్శకమైన, నీతివంతమైన సుపరిపాలనను అందించడా నికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించి మొదటి సారి 17వ లోక్ సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న 277 సభ్యుల ద్వారా ఈ అంశానికి బలం చేకూరినట్లయ్యింది. ఇదే స్ఫూర్తితో 2024 లోక్ సభ ఎన్నికలలో కూడా సమాజ శ్రేయస్సును, దేశాభివృద్ధిని కాంక్షించే విద్యావంతులైన యువకులు, సచ్చీలురు ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొని తమ దేశభక్తిని చాటుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది.
ప్రపంచవ్యాప్తంగా 1960వ దశకం చివరి వరకు 77 శాతం పైగా పౌరులు తమ ఓటు హక్కును వినియోగించు కోగా 2010 తర్వాత సగటు ఓటింగ్ శాతం 67 కంటే తక్కువకు చేరడం గమనార్హం. ఓటర్లను నాయకులు తమ ను అందలానికి ఎక్కించే సాధనాలుగా కాక ప్రజా సమ స్యల పరిష్కారానికి చొరవ చూపి వారికి మానసికంగా దగ్గరయ్యే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఓటర్లలో ఉదా సీనత తగ్గి నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి పరిఢవిల్లడంతో పాటు ఓటింగ్ శాతంలో వృద్ధి నమోదవుతుంది. అంతే కాదు పౌరులు తమ హక్కులతో పాటు బాధ్యతలను గుర్తె రిగి ప్రశ్నించేతత్త్వం అలవర్చుకుని దేశాభివృద్ధికి తోడ్పాటు నందించిన నాడు మరియు ప్రజా ప్రతినిథులలో జవాబు దారీతనం పెరిగి దేశ విశాల ప్రయోజనాల కోసం శ్రమిం చిన నాడు భరత జాతి కీర్తి ఖండాంతరాలను దాటుతుంది.
- యేచన్ చంద్ర శేఖర్
మాజీ రాష్ట్ర కార్యదర్శి
ది భారత్ స్కౌట్స్ & గైడ్స్, తెలంగాణ
హైదరాబాద్
8885050822