Friday, November 22, 2024
HomeతెలంగాణTRS Party: కేసీఆర్ తొలి సర్వే.. ఈ ఫలితాల ఆధారంగానే టికెట్లు?

TRS Party: కేసీఆర్ తొలి సర్వే.. ఈ ఫలితాల ఆధారంగానే టికెట్లు?

TRS Party: షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది 2023 డిసెంబర్ లోనే తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరిగినా అది ఇప్పటి వరకు ఊహాగానాలు మాత్రమే. కాగా.. ఏడాది ముందే ఎన్నికల సమరానికి సిద్ధమయ్యేందుకు కేసీఆర్ అన్ని సన్నాహాలు చేసుకుంటున్నట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. ఈ ఏడాది డిసెంబర్ లో జాతీయ పార్టీ బీఆర్ఎస్ కు అధికారిక అనుమతులు రానుండడంతో అప్పటి నుండే ఎన్నికల శంఖారావం పూరించనున్నట్లు తెలుస్తుంది.

- Advertisement -

బీఆర్ఎస్ పార్టీతో జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని చూస్తున్న గులాబీ బాస్ ముందుగా సొంత రాష్ట్రంలో గెలుపు ఖాయం చేసుకోవాలి. అందుకే తెలంగాణలో మరోసారి జెండా పాతేందుకున్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నారట. ముందుగా మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు, నియోజకవర్గాలలో ప్రజల స్పందనపై కేసీఆర్ ఓ సర్వే చేయించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే కేసీఆర్ చేతికి అందిన ఈ సర్వే ఫలితాల ఆధారంగా ఎమ్మెల్యేలను మూడు కేటగిరీలుగా విభజించినట్లు తెలుస్తుంది.

ఈ మూడు కేటగిరీలలో ఖచ్చితంగా గెలిచే స్థానాలను ఏ కేటగిరీగా విభజించగా.. ఇందులో 35 నుండి 45 స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండి.. టీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెడితే గెలిచే స్థానాలుగా 30 నుండి 35 స్థానాలను బీ కేటగిరీగా విభజించగా.. మిగతా స్థానాలలో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీతో ట్రైయాంగిల్ పోటీ తప్పదని సర్వే ఫలితాలు వెల్లడైనట్లు తెలుస్తుంది. ఈ సీ కేటగిరీని డేంజర్ జోన్ గా పరిగణిస్తున్నారట.

బీ కేటగిరీలో ఎక్కువ శాతం స్థానాలు కాంగ్రెస్ కు బలంగా ఉండగా.. అక్కడి ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో ఇక్కడ ఫోకస్ పెట్టి ప్రజలను తమ వైపుకు తిప్పుకొనేందుకు ప్లాన్ సిద్ధం చేయనుండగా.. ఇక డేంజర్ కేటగిరి సీలో ఎమ్మెల్యేలకు మాత్రం ఈసారి టికెట్లు దక్కడం కష్టమేనని వినిపిస్తుంది.

ఎందుకంటే, ఈసారి ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీకి ఎంతో కీలకమో అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రత్యామ్నాయంగా బీజం వేయాలనుకుంటున్న కేసీఆర్ కు తెలంగాణ పీఠం చాలా అవసరం. అందుకే రిస్క్ చేసే పరిస్థితి లేదు కనుక డేంజర్ జోన్ లో క్యాండిడేట్లకు టికెట్లు దక్కే ఛాన్స్ ఉండదు. క్యాండిడేట్లను మార్చేందుకే కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. కొంతలో కొంత వచ్చే ఆరు నెలలలో పనితీరు మెరుగుపరుచుకుంటే తప్ప.. ఈ సీ కేటగిరీ ఎమ్మెల్యేలకు ఈ సారి టికెట్లు దక్కడం కలేనని తెలుస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News