Sunday, April 13, 2025
HomeతెలంగాణChegunta: మండల పరిషత్ లో ఓటు హక్కుపై ప్రతిజ్ఞ

Chegunta: మండల పరిషత్ లో ఓటు హక్కుపై ప్రతిజ్ఞ

ఓటు హక్కుపై విస్తృత ప్రచారం

చేగుంట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో చేగుంట మండల తహసిల్దార్ గియా సున్నిసా బేగం, ఎంపీడీవో చిన్నారెడ్డి ఆధ్వర్యంలో చేగుంట మండల గ్రామ పంచాయతీ సెక్రటరీలకు పార్లమెంట్ ఎన్నికల విషయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. మే 13 జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నా ఓటు హక్కు వినియోగించుకుంటానని, నాతోటి సహచరులకు ఓటు పట్ల అవగాహన కల్పించి ఓటు హక్కు వినియోగించుటలో నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేయించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మండల సెక్రటరీలు పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ సిబ్బంది ఐకెపి సిబ్బంది ఈజీఎస్ సిబ్బంది ఏపీవో శ్వేత ఏపిఎం లక్ష్మీనరసమ్మ, సీనియర్ అసిస్టెంట్ మడిగెల శ్రీశైలం జూనియర్ అసిస్టెంట్ విజయ్ కుమార్ అటెండర్ రాములు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News