Friday, November 22, 2024
Homeనేరాలు-ఘోరాలుKarimnagar: తప్పిపోయిన తల్లి-బిడ్డలను కలిపిన పోలీసులు

Karimnagar: తప్పిపోయిన తల్లి-బిడ్డలను కలిపిన పోలీసులు

పోలీసులకు అభినందనలు

ఉత్తరప్రదేశ్ బస్తి జిల్లాకు చెందిన షేర్ అలీ వృత్తి రిత్యా పెయింటింగ్ పని చేసుకుంటూ కరీంనగర్ బొమ్మకల్ లో భార్య-కూతురుతో నివసిస్తున్నాడు. భార్య భర్తలిరువురు ఇటీవల గొడవపడగా, భార్య కూతురితో సహా ఇంట్లో నుండి వెళ్ళిపోయి మాతా శిశు ఆసుపత్రిలో ఉంటోంది. ఇదిలా ఉండగా శనివారం సాయంత్ర సమయంలో తల్లి నూర్ వద్ద నుండి పాప అమీనా కతూన్ తప్పిపోయిందని గ్రహించి కరీంనగర్ టూ టౌన్ పోలీసులకు సమాచారం అందించింది.

- Advertisement -

సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన పోలీసులు కరీంనగర్ టౌన్ ఏసీపీ నరేందర్, టూ టౌన్ ఇన్స్పెక్టర్ విజయకుమార్ తమ సిబ్బందితో సహా త్వరితగతిన సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి, దర్యాప్తు జరిపి అందుబాటులో వున్న సాంకేతికతో ఆసుపత్రి దగ్గర్లోనే పాప అమీనా కతూన్ ను తన తండ్రి షేర్ అలీతో వున్నదని గుర్తించిన పోలీసులు, తండ్రిని విచారించగా, తన భార్యకు తెలియకుండా కూతురిని తానే తీసుకెళ్లాడని అంగీకరించాడని, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి క్షేమంగా వారికి అప్పగించామని టౌన్ ఏసీపీ నరేందర్ తెలిపారు. తప్పిపోయిన పాపను వెతికి గుర్తించుటలో కృషి చేసిన కరీంనగర్ ఇన్స్పెక్టర్ టూ టౌన్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్, ఇతర అధికారులు సిబ్బందిని ఏసీపీ అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News