గార్ల మండల కేంద్రంలో నిర్వహించిన హోలీ సంబరాలు అంబరాన్ని తాకాయి. హోలీ పండుగను పురస్కరించుకొని ప్రజలు హోలీ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం రాత్రి కామ దహనం చేసి ఉదయం తెల్లవారు నుంచి హోలీ వేడుకలలో చిన్న పిల్లలు, పెద్దలు, యువకలు వయో బేధం లేకుండా రంగులు చల్లుకుంటూ కేరింతలు కొడుతూ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. గార్ల పట్టణ పురవీధులు మొత్తం రంగులమయమైనాయి.
యువకులు బైక్ లపై షికార్లు చేస్తూ రంగులు చల్లుకున్నారు. అలాగే స్థానిక ప్రధాన కూడలిలోని ఆటోడ్రైవర్లు రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకున్నారు. పండుగ మధ్యాహ్న సమయంలో యువకులు బావుల వద్దకు వెళ్లి స్నానాలు చేశారు. మండలంలోని సీతంపేట గ్రామస్తులు ఉపాధి హామీ పనులు చేసి ఇంటికి వచ్చే సమయంలో మహిళలు ఒకరికి మరొకరు రంగులు చల్లుకుంటూ ఆనందంగా హోలీ సంబరాలు జరుపుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.