వసంత రుతువు ఆగమనంతో చెడుపై మంచి విజయానికి సంకేతంగా నిర్వహించేదే ఈ హోలీ పండుగని జెడ్పిటిసి ఝాన్సీ లక్ష్మీ పేర్కొన్నారు. హోలీ పండుగను పురస్కరించుకొని గార్ల మండల పరిధిలోని మర్రిగూడెం గ్రామంలో గ్రామస్తులతో కలిసి హోలీ సంబరాలలో పాల్గొని అందరితో మమేకమై రంగులు చల్లుకుంటూ వేడుకలు నిర్వహించారు. అనంతరం ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంద్రధనస్సులోని ఏడు రంగుల లాగా మనిషి జీవితంలో రాగద్వేషాలకు అతీతంగా అందరిని ఒకే చోటకు చేర్చే పండుగే ఈ హోలీ అన్నారు. రంగుల మయమైన హోలీ పండుగలా ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ గార్ల మండల ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.