Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Adoni: స్థానికులకే బిజెపి టికెట్ ఇవ్వాలి

Adoni: స్థానికులకే బిజెపి టికెట్ ఇవ్వాలి

స్థానిక నేత అధిష్ఠానాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాడని ఆరోపణలు

ఆదోని టికెట్ కేటాయింపులో జరుగుతున్న హైడ్రామాకు తెరదించుతూ స్థానిక అభ్యర్థిని ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యే, బిజెపి నాయకులు ప్రకాష్ జైన్ డిమాండ్ చేశారు. స్థానిక రాజశ్రీ హోటల్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన ఆయన.. స్థానిక బీజేపీలోని ఒక నాయకుడు రాష్ట్ర అధిష్టానాన్ని తప్పుదోవ పట్టిస్తూ ట్రాన్స్పోర్ట్ నాయకులను ఆదోని బరిలో నిలిపేందుకు కుట్రలు చేస్తున్నాడన్నారు. మైనారిటీలు, అల్ప సంఖ్యాకులు అధికంగా ఉండే ప్రాంతంలో స్థానికులకే కష్టతరం అవుతుంటే, స్థానికేతురుడిని తీసుకువస్తే ప్రజలు అదరించరన్నారు. ఇప్పటికైనా అధిష్టానం పునరాలోచించి 14 ఏళ్ల పాటు బిజెపిలో కొనసాగుతున్న తనకు సీట్ కేటాయించాలన్నారు. గత రెండు ఎన్నికలో ఒక సారి పొత్తులో కోడుమూరుకు పైగా, మరోసారి కన్నా లక్ష్మినారాయణ అధ్యక్షుడిగా ఉన్నపుడు తన పేరు ప్రకటించే సమయంలో పోటీ చేసిన నాయకుడు సీట్ ఇవ్వకపోతే విషం త్రాగి చనిపోతానని బెదిరించడంతో తనకు తప్పించడం జరిగిందన్నారు. తన స్వలాభం కోసం స్థానికుడి పేరు ప్రస్తావించకుండా డాక్టర్ పార్థసారథి పేరును తెరపైకి తెచ్చాడని, అధిష్టానం తీరు మారకుంటే డాక్టర్ పార్థసారథికి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News