అభివృద్ధి ప్రదాత, జనహృదయ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని గెలిపించుకుని డోన్ నియోజకవర్గ అభివృద్ధిని కొనసాగించుకోవాల్సిన ఆవశ్యకత నియోజకవర్గ ప్రజలందరి భాద్యత అని ప్యాపిలి వైసీపీ యువ నాయకులు బోరెడ్డి రఘునాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం నిరంతరం తపిస్తూ, అలుపెరుగని నిరంతర శ్రామికుడిలా డోన్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతూ విద్య, వైద్యం, రోడ్డు రవాణా, తాగునీరు, ఇలా అన్నిరంగాల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న బుగ్గనను, అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గెలిపించేందుకు ప్రజలు తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తు పై వేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ యువజన విభాగం అధ్యక్షులు ప్రకాష్ రెడ్డి, టౌన్ యూత్ అధ్యక్షులు రమణ, అనిల్ , నంద్యాల జిల్లా కురువ సంఘం అధ్యక్షుడు మేకల ప్రవీణ్, రఘు , సోషల్ మీడియా కో కన్వీనర్ ప్రేమ్, మైనారిటీ నాయకుడు షా షా , మండల కన్వీనర్ విఘ్నేశ్వర రెడ్డి,సోషల్ మీడియా కో కన్వీనర్ కమతం పుల్లారెడ్డి, జాకీర్ తదితరులు పాల్గొన్నారు.