Saturday, November 23, 2024
Homeపాలిటిక్స్Sangareddy: గెలిపిస్తే 100 కోట్లతో ట్రస్ట్

Sangareddy: గెలిపిస్తే 100 కోట్లతో ట్రస్ట్

బిఆర్ఎస్ మెదక్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి

మెదక్ ప్రజలు నన్ను ఆశీర్వదించి ఎంపీగా గెలిపించిన తర్వాత రూ.100 కోట్లతో పీవీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి, నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తానని బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి హామీ ఇచ్చారు. సంగారెడ్డి సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ 25 ఏళ్ల సర్వీసులో 11 ఏళ్ళు ఉమ్మడి మెదక్లో సేవలు అందించానని తెలిపారు. ఏనాడు ప్రజలకు దూరంగా లేనని గ్రూప్ 1 స్టేట్ ర్యాంకర్ సాధించానని, 25 ఏళ్ల పాటు ప్రజలకు సేవ చేశామని, అవసరం కోసం వచ్చిన వారిని కుటుంబ సభ్యులుగా చూసా, అందుకే ప్రజల్లో మంచి పేరు ఉందని వెంకట్రామిరెడ్డి అన్నారు. మెదక్ ఎంపీ పక్కాగా గెలువబోతున్నామని ఉమ్మడి మెదక్ లో పార్టీ బలంగా ఉందన్నారు.
ఐఏఎస్ చేసిన అధికారిగా చెబుతున్న దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి కేసీఆర్ చేశారు. పరిపాలనలో భాగస్వామ్యం ఉంది. రాబోయే రోజుల్లో ఒక ఎంపీగా ప్రజలకు మరింత మంచి సేవలు అందిస్తామని తెలిపారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గంలో పెద్ద ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసి, కార్యకర్తలకు ఉచిత సేవలు అందిస్తామని ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.

- Advertisement -

ఈ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్ టిఆర్ఎస్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్ జడ్పీ చైర్మన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్ దేశ్పాండే టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News