Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Gospadu: వరదలా టిడిపిలోకి వలసలు

Gospadu: వరదలా టిడిపిలోకి వలసలు

పుంజుకున్న టీడీపీ

గోస్పాడు మండలంలో తెలుగుదేశం పార్టీ రోజురోజుకు పుంజుకుంటుంది. ఇప్పటికే మండలంలోని యాళ్లురు జూలేపల్లి, గోస్పాడు, జిల్లెల్ల, తేల్లపురి వంటి పెద్ద పెద్ద గ్రామాలలో టిడిపి ఓటు బ్యాంక్ బలంగా ఉన్న విషయం రాజకీయ నాయకులందరికి తెలిసిందే. ఆయా గ్రామాల్లో ఉన్న వైఎస్ఆర్సిపి నాయకులు కొందరు గత నాలుగు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్, జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్, ఏపీ మాజీ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాతి రెడ్డి తులసి రెడ్డి ఆధ్వర్యంలో దాదాపుగా 300 మంది వైఎస్ఆర్సిపి కార్యకర్తలు టిడిపి పార్టీలో చేరడంతో టిడిపి నాయకుల్లో మరింత జోష్ పెరిగింది. దీంతో మండలంలో టిడిపిలోకి వరదలా వలసలు వస్తుండటంతో తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు సంతోషం వ్యక్తపరుస్తున్నారు. గోస్పాడు మండలంలో తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజార్టీ అందిస్తామని మండల కన్వీనర్ తులసిరెడ్డి నంద్యాల టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ఫారుక్ కు మాట ఇచ్చినట్టు సమాచారం. అందులో భాగంగానే మండలంలోని అన్ని గ్రామాలలో తులసిరెడ్డి పర్యటిస్తూ టిడిపి మేనిఫెస్టో ను కార్యకర్తలకు, ప్రజలకు తెలియపరుస్తు టిడిపిలో జోష్ పెంచారు. గతంలో గోస్పాడు మండలం వైసిపికి కంచుకోటగా ఉండేది. మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నిరుత్సాహంగా ఉన్న వారిలో ఉత్సాహం నింపారు తులసిరెడ్డి. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో గోస్పాడు మండలంలో టిడిపికి అత్యధిక మెజార్టీ తీసుకొని వచ్చి టిడిపి జెండా ఎగరవేస్తామని మండల కన్వీనర్ తులసి రెడ్డి తెలుగుప్రభకు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News