Friday, November 22, 2024
HomeNewsGarla: నేడు గోపాలపురానికి మంత్రి పొంగులేటి రాక

Garla: నేడు గోపాలపురానికి మంత్రి పొంగులేటి రాక

అందరూ తరలిరండి..

నేడు గోపాలపురం గ్రామంలోని పలు దేవాలయాలలో జరగనున్న జీవ ధ్వజస్తంభ ప్రాణ ప్రతిష్ట మహోత్సవానికి మంత్రి పొంగులేటితో సహా ఎమ్మెల్యే కోరం కనకయ్య మాజీమంత్రి కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ పార్లమెంటు అభ్యర్థి పోరిక బలరాం నాయకులు రానున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధనియాకుల రామారావు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గార్ల మండల పరిధిలోని గోపాలపురం గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన శ్రీ శీతల పరమేశ్వరి నాభి శిల బొడ్రాయి ముత్యాలమ్మ తిరుపతమ్మ ఆంజనేయ స్వామి దేవాలయాలలో బుధవారం నిర్వహించే జీవ ధ్వజస్తంభ ప్రాణ ప్రతిష్ట ప్రారంభ మహోత్సవానికి తెలంగాణ రెవిన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయకులు ఉదయం 11 గంటలకు హాజరుకానున్నారని జడ్పిటిసి ఎంపిటిసిలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహిళా నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ వివిధ సంఘాల నాయకులు పార్టీ అభిమానులు మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ధ్వజస్తంభ ప్రాణప్రతిష్ట మహోత్సవ ఆశీస్సులను పొందాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News