Monday, November 25, 2024
Homeనేషనల్Assam: వచ్చే ఎలక్షన్స్ వరకు అరెస్టులే..అస్సాంలో ఏం జరుగుతోంది?

Assam: వచ్చే ఎలక్షన్స్ వరకు అరెస్టులే..అస్సాంలో ఏం జరుగుతోంది?

అస్సాంలో అరెస్టులు వచ్చే ఎన్నికల వరకూ తప్పవంటున్న సీఎం అస్సామీలకు పెద్ద షాకే ఇచ్చారు.

- Advertisement -

అస్సాంలో ఆర్ధరాత్రి రెండు గంటలకు కూడా పోలీసుల దాడులు సాగుతున్నాయి. బాల్య వివాహాలు చేసుకున్న వారిని, చేయించిన పెళ్లి మత పెద్దలను కూడా జైల్లోకి తోస్తూ కేసులు పెడుతోంది అస్సాం రాష్ట్ర ప్రభుత్వం. ఈనేపథ్యంలో అస్సాంలోని ప్రతి గ్రామంలోనూ ఇలా బాల్య వివాహాలు చేసినవారు భయం భయంతో బిక్కుబిక్కుమని ఉంటున్నారు. మరోవైపు కొందరు ఇప్పటికే అడ్రస్ లేకుండా పారిపోయారుకూడా. హిందూ-ముస్లింలన్న తేడా లేకుండా బాల్య వివాహాలు ఎక్కడ జరిగితే అక్కడ పోలీసులు మెరుపు దాడులు చేస్తూ అరెస్టులు చేసేస్తున్నారు. శనివారం నుంచి ఇప్పటికే ఏకంగా 2,258 మందిని అరెస్టు చేసి, కేసులు పెట్టారు. వీరిలో కొందరు లేచిపోయి ప్రేమ వివాహాలు చేసుకున్నవారు కూడా ఉన్నారు. ఇప్పుడు వీరందరి పరిస్థితి అయోమయంగా మారింది. కొందరు కడుపుతో ఉన్న యువతులు తమ భర్తలను పోలీసులు తీసుకెళ్తుంటే గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. నిజానికి పోలీసుల వద్ద బాల్యవివాహాలకు సంబంధించిన చిట్టా చాలా పెద్దగా ఉందని, 8,000 మంది ఈ మధ్య కాలంలో బాల్య వివాహాలు చేసుకున్నట్టు పోలీసులు గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు.

కేవలం 15 రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 4,074 మంది బాల్య వివాహాలు చేసుకున్నట్టు అధికారిక సమాచారం ఉంది. కాగా చీఫ్ మినిస్టర్ హిమంత బిస్వా మాత్రం 2026లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల వరకు ఈ బాల్యవివాహాల ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందని తేల్చి చెప్పారు. దీంతో ఇప్పటికే పెళ్లై, పిల్లల తల్లిదండ్రులైనవారు భయంతో వణికిపోతున్నారు. వీరి తల్లిదండ్రులకు ఏం చేయాలో పాలుపోవటం లేదు. అస్సాంలో నవజాత శిశువుల, భ్రూణ హత్యలు, పోషకాహార సమస్య, ప్రసవం సమయంలో తల్లి మరణాలు అత్యధికంగా ఉన్నాయి. వీటన్నింటికీ ప్రధాన కారణం బాల్య వివాహాలే కావటం విశేషం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News