Saturday, November 23, 2024
Homeపాలిటిక్స్Nandyala: ఎన్నికల సమర శంఖారావం పూరించిన శిల్పా

Nandyala: ఎన్నికల సమర శంఖారావం పూరించిన శిల్పా

ప్రత్యర్థులపై నిప్పులు చెరుగుతూ..

నంద్యాల నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి నంద్యాల పట్టణం 6వ వార్డు నుండి ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించారు. ముందుగా తండ్రి మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి, చిన్నాన్న శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ల ఆశీస్సులను తీసుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించి సమర శంఖారావాన్ని పూరించారు. ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి రాను ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదించాలని వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రజలను కోరారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో నంద్యాల మున్సిపల్ చైర్ పర్సన్ మాబన్నీ సా, రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ పి.పి నాగిరెడ్డి, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాం షావలి, ఆరో వార్డు కౌన్సిలర్ పురందర్ కుమార్ హాజరయ్యారు.అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ…. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన 5 సంవత్సరాల కాలంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రచారాన్ని చేపడుతున్నామని తెలిపారు. గత ఏ ప్రభుత్వం ఎన్నడు చేపట్టనటువంటి విధంగా ప్రతి గడపకు వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు గురించి తెలియజేయడం జరిగిందన్నారు. జగనన్న ప్రభుత్వంలో పారదర్శక పాలన, అవినీతీకి తాపులేకుండా ప్రజలకు మేలు చేసి నేడు ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లి ఓట్లను అడుగుతున్నామన్నారు.

నంద్యాల నియోజ కవర్గంలో 225 రోజులపాటు ప్రతి వార్డుకు, గ్రామానికి వెళ్లి గడపగడపను తాకామన్నారు. నేడు ప్రతి పక్షాలు వెళ్లి ఓటు అడిగే పరిస్థితి లేదన్నారు. కూటమిగా ఏర్పడి ఒక్కొక్కరు కాకుండా అందరు కలిసికట్టుగా చేస్తున్న ప్రయత్నాలు విఫలం కావడం ఖాయం అన్నారు. రాష్ట్రంలో జగనన్న పనిచేశాడు కాబట్టే ఓట్లను అడుగుతున్నామన్నారు. 15 సంవత్సరాలుగా నంద్యాల నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న వారు మంత్రిగా, డిప్యూటీ స్పీకర్ గా, కౌన్సిల్ చైర్మన్ గా అనేక పదవులను చేపట్టినా నంద్యాలకు ఏమి చేశారో చెప్పాలన్నారు. కేపలం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 3 సంవత్సరాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. పగలు పొత్తులతో 3 కండువాలను వేసుకొని తిరుగుతూ రాత్రి మాత్రం చీకటి మంతనాలు చేస్తున్నారన్నారు. నంద్యాలలో పొత్తులు పెట్టుకున్నా ధైర్యంగా కండువాలు కప్పుకొని ప్రచారానికి వెళ్లలేని నాయకులను ప్రజలు గమనించాలన్నారు.

సీఏఏ అమలుకు నాడు వ్యతిరేకించిన వీరంతా నేడు వారితోనే వంత పాడుతూ ఉన్నారని. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారన్నారు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉన్న టీడీపి అభ్యర్థి నంద్యాలకు ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. నేడు తాము ఇచ్చిన వాటి గురించి చేసిన వాటి గురించి చెబుతూ ప్రజల్లోకి వెళ్తున్నామని, ప్రతి పక్షాలు మాత్రం చేస్తామని చెబుతున్నారని వీరిని ప్రజలు ఎలా నమ్ముతారో చూడాలన్నారు. నంద్యాలలో 4వ సారి వైఎస్సార్సీపీ జెండా ఎగురవేయడం ఖాయమని, బంపర్ మెజారిటీతో ఎమ్మెల్యే గా శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి గెలవడం తథ్యం అన్నారు. నూటికి నూరు శాతం జూన్ 4వ తేది రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి సీఎంగా పదవి చేపట్టడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ డాక్టర్ శశికళ రెడ్డి, నంద్యాల ఎంపీపీ శెట్టి ప్రభాకర్, గోస్పాడు మండల కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి,వైఎస్ఆర్సిపి రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షుడు పి పి మధుసూదన్ రెడ్డి, నంద్యాల మండల కన్వీనర్ బసవేశ్వర్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయ శేఖర్ రెడ్డి, దృశ్యకళల డైరెక్టర్ సునీత అమృతరాజ్, నంద్యాల పట్టణ అధ్యక్షులు పడకండ సుబ్రహ్మణ్యం, జాకీర్ హుస్సేన్, పున్నా శేషయ్య, కన్వీనర్లు దాల్మిల్ అమీర్ , సాయిరాం రెడ్డి, సలాముల్ల, వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వార్డు ఇన్చార్జులు, గిరిజన సమాఖ్య అధ్యక్షుడు, కార్యకర్తలు అభిమానులు, పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News