తెలంగాణ బడ్జెట్ ప్రజల ఆకాంక్ష కు అనుగుణంగా ఉంటుందని.. కేసిఆర్ ఆలోచనలకు అనుగుణమైన బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఆర్థికమంత్రి హరీష్ రావు అన్నారు. సంక్షేమానికి అభివృద్ధి రెండు జోడేద్దులగా సమపాళ్లలో ఉండబోతోందని.. కేంద్రం నుండి వివక్ష కొనసాగుతుంటే, ఒక్క రూపాయి కూడా కేంద్రం నుండి రాకపోయినా అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ ముందుకెళ్తోందని హరీష్ అన్నారు. సంక్షేమ పథకాలు ఆగకూడదన్న కెసీఆర్ ఆలోచనతో బడ్జెట్ కేటాయింపులు చేసినట్టు ఆయన వివరించారు. తెలంగాణ మోడల్ దేశం అవలంభిస్తోందని..దేశానికి రోల్ మోడల్ తెలంగాణ నిలిచిందని హరీష్ వెల్లడించారు.
శాసనసభలో తాను, శాసన మండలిలో ప్రశాంత్ రెడ్డి ప్రవేశ పెడతారని ఆయన తెలిపారు. ఉదయం 10.30 కు బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నట్టు హరీష్ తెలిపారు. సభలో బడ్జెట్ ప్రవేశపెట్టేముందు జూబ్లిహిల్స్ లోని వెంకటేశ్వర స్వామి గుళ్లో హరీష్ రావు ప్రత్యేక పూజలు చేశారు.
Telangana Budget: సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల్లా బడ్జెట్ సమపాళ్లలో ఉంటుందన్న హరీష్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES