Friday, September 20, 2024
Homeఇంటర్నేషనల్Turkey: 180 దాటిన టర్కీ భూకంప మృతులు, శిథిలాల కింద ఇంకా..

Turkey: 180 దాటిన టర్కీ భూకంప మృతులు, శిథిలాల కింద ఇంకా..

టర్కీ భూకంపం ధాటికి ఇప్పటికే 180 మంది మరణించినట్టు టర్కీ సర్కారు ప్రకటించింది. పేకమేడల్లా కూలిపోయిన భవనాల శిథిలాల నుంచి పెద్ద ఎత్తున క్షతగాత్రులను, మృతదేహాలను వెలికి తీస్తున్నారు. ఇప్పుడిప్పుడే సహాయక చర్యలు ఊపందుకుంటున్నాయి టర్కీలో. టర్కీలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం భారీగా సంభవించింది.

- Advertisement -

ఈ తెల్లవారుజామున ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్నప్పుడు రిక్టర్ స్కేల్ పై 7.8 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం ధాటికి ప్రాణ నష్టం అధికంగా సంభవించింది. టర్కీ, పొరుగునే ఉన్న సిరియాలోనూ మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సైప్రస్, ఈజిప్ట్, లెబనన్ లోనూ భూమిలో కొద్దిసేపు ప్రకంపనలు వచ్చాయి. ఈ దేశాల్లో ఆస్తి నష్టం సంభవించింది. సిరియాలో మృతుల సంఖ్య ప్రస్తుతానికి 50 దాటింది.

1999లోనూ ఇదే తరహా భారీ భూకంపం టర్కీని కుదిపేసింది. దశాబ్దం క్రితం వచ్చిన భూకంపం ధాటికి అప్పట్లో 17,000 మంది మరణించారు. కాగా టర్కీ రాజధాని ఇస్తాంబుల్ లో ఎడాపెడా ప్రకృతిని ధ్వంసం చేస్తూ భారీ నిర్మాణాలు చేస్తూ ప్రకృతి ప్రకోపానికి గురయ్యేలా పరిస్థితులు చేజేతులా తెచ్చుకుంటున్నారని శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో హెచ్చరిస్తూనే ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News