Friday, November 22, 2024
Homeఇంటర్నేషనల్Salman Rushdie: మార్కెట్లోకి సల్మాన్ రష్దీ కొత్త పుస్తకం విక్టరీ సిటీ

Salman Rushdie: మార్కెట్లోకి సల్మాన్ రష్దీ కొత్త పుస్తకం విక్టరీ సిటీ

సంచలన రచయిత సల్మాన్ రష్దీ కొత్త పుస్తకం ‘విక్టరీ సిటీ’ విడుదలైంది. అయితే సల్మాన్ రష్దీ కత్తి పోట్లకు గురికాకముందే ఈ పుస్తకాన్ని ఆయన రాశారు. కాగా ప్రస్తుతం ఈ ‘విక్టరీ సిటీ’ పుస్తకం మార్కెట్లోకి అందుబాటులోకి రావటంతో ఆయన ఫ్యాన్స్ లో ఆనందం నెలకొంది. మరోవైపు ఆయన ఇంకా కోలుకుంటున్నారు.

- Advertisement -

6 నెలల క్రితం సల్మాన్ రష్దీని చంపేందుకు ఓ ఆగంతకుడు ప్రయత్నించగా ఆయన తీవ్రంగా గాయపడ్డారు. విక్టరీ సిటీ పుస్తకం విషయానికి వస్తే ఇది 14వ శతాబ్దంలో జరిగిన కథగా ఆయన రాశారు. ఈ పుస్తకాన్ని సంస్కృతంలోని ఓ ఘట్టాన్ని ఇంగ్లీష్ లోకి ఆయన అనువదించారని తెలుస్తోంది. పంపా కంపనా అనే ఓ యువకురాలి జీవితం ఆధారంగా ఈ కథను అల్లినట్టు చెబుతున్నారు.

75 ఏళ్ల రష్దీ సటానిక్ వర్సెస్ అనే పుస్తకంలో దైవ దూషణ చేశారంటూ టర్కీ ఆయనపై ఫత్వా జారీ చేసింది. ఈ పుస్తకం రేపిన వివాదంతో చిక్కుల్లో పడి 20 ఏళ్లుగా అమెరికాలో ఉంటూ స్థిరపడిపోయారు. అయితే అనారోగ్యం, వయసు రీత్యా ఆయన తన కొత్త పుస్తకం ప్రచార కార్యక్రమాలు చేప్టటడం లేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News